శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్, వైసిపి స్పందన: హైకోర్టు చెప్పిందిలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఐటీ రిటర్న్ దాఖలు చేయని వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు, దాచిపెట్టేందుకు తెలుగుదేశం తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నోటరీ అంశాన్ని తెరపైకి తెచ్చిందని వైసిపి విమర్శించింది.

అనూహ్యంగా శిల్పా మోహన్ రెడ్డికి షాకిచ్చిన తెలుగుదేశం

హైకోర్టు చెప్పిందని వైసిపి స్పందన

హైకోర్టు చెప్పిందని వైసిపి స్పందన

నోటరీ రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకుంటే చాలని హైకోర్టు చెప్పిందని వారు అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్లో ఎలాంటి లోపాలు లేవని చెప్పారు.

భూమా చెప్పింది ఇదీ

భూమా చెప్పింది ఇదీ

భూమా బ్రహ్మానంద రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో ఐటీ రిటర్న్స్ సమర్పించలేదని వైసిపి సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. తనది హిందూ అవిభాజ్య కుటుంబమని తన నామినేషన్లో పేర్కొన్నారని, అయితే భూమా కుటుంబం హిందూ అవిభాజ్యమైతే గతంలో అకిలప్రియ నామినేషన్లో ఎందుకు పేర్కొనలేదని వైసిపి నేతలు ప్రశ్నించారు.

ఉద్దేశ్య పూర్వకంగా ఐటీ దాఖలు చేయలేదు

ఉద్దేశ్య పూర్వకంగా ఐటీ దాఖలు చేయలేదు

ఉద్దేశ్యపూర్వకంగా బ్రహ్మానంద రెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని, ఆదాయ, వ్యవయ వివరాలు వెల్లడించనందున ఆయన నామినేషన్ తిరస్కరించాలని కోరారు.

ఎన్నికల అధికారి ఇలా

ఎన్నికల అధికారి ఇలా

నామినేషన్ల స్క్రూటినీ సమయంలో అభ్యంతరాలను ముందుకుతీసుకురాగా, ఇతర అభ్యర్థుల నామినేషన్ల తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party leaders responded on Telugu Desam Party allegations on YSRCP Nandyal candidate Silpa Mohan Reddy nomination.
Please Wait while comments are loading...