ఉప ప్రధానిగా బాబు, సీఎంగా లోకేష్? పవన్ తో వైసీపీ షాకింగ్ రియాక్షన్..!

తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను సీఎం పదవి నుంచి తప్పించి జాతీయ రాజకీయాల్లోకి తీసుకుంటున్న బీజేపీ.. ఏపీలోనూ అలాంటి ప్రయోగాలు చేయబోతోందన్న చర్చ మొదలైంది. దీనికి కొనసాగింపుగా చంద్రబాబు(Chandrababu)ను ఉప ప్రధానిగా చేసి, ఆయన కుమారుడు లోకేష్ (nara lokesh)ను సీఎంను చేస్తారంటూ టీడీపీ అనుకూల ఛానళ్లలోనే ప్రచారం జరుగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఈ ప్రచారంపై విపక్ష వైసీపీ స్పందించింది.

వైసీపీ నేత తోట త్రిమూర్తులు దీనిపై చిట్ చాట్ లో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన త్రిమూర్తులు.. సీఎం చంద్రబాబు ఉపప్రధాని, లోకేష్ సీఎం అవుతారని ప్రచారం జరుగుతోందన్నారు. చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే పవన్‌ కళ్యాణ్ (pawan kalyan)ను సీఎం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అంటే కాపులు ఒప్పుకునే ఛాన్సే లేదన్నారు.

YSRCP Responds to Chandrababu s Deputy PM Lokesh s CM Buzz-demands key post to pawan kalyan

మరోవైపు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉగాది తర్వాత లోకేష్‌ సీఎం అయ్యే అవకాశం ఉందని పేర్ని తెలిపారు. ఇదే అంశాన్ని చంద్రబాబు, పవన్ చర్చించుకున్నారన్నారు. తన కుమారుడితో కలిసి పని చేయాలని..చంద్రబాబు పవన్‌ను కోరారని పేర్ని నాని వెల్లడించారు. ఇద్దరం ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని పవన్‌కు చెప్పారన్నారు. కేంద్ర నిఘా వర్గాలద్వారా తనకు ఈ విషయాలు తెలిశాయన్నారు. దీంతో వైసీపీ నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+