జనసేనలో నేనెందుకు చేరుతా, నామీద ఆంధ్రజ్యోతి పెద్దమనసు, కానీ: రోజా ఆసక్తికరం
Recommended Video

అమరావతి: తాను జనసేన పార్టీలో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలు అన్ని కూడా అవాస్తవమని, చీప్ పబ్లిసిటీ కోసం టీడీపీ నేతలు నేతలు ఇలాంటి వార్తలను వ్యాప్తింప చేస్తున్నారని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా రోజా మండిపడ్డారు. జనసేనలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు.
పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌కు రాజమండ్రి ప్రజలు ఘన స్వాగతం పలికారని, జగన్ కోసం ప్రజలు ఎంతగా నిరీక్షిస్తున్నారో ఇది ఒక నిదర్శనమన్నారు. రోజా జనసేనలోకి వెళ్తుందని టీడీపీ వాళ్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో తాము ఏం చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేదని, గతంలో ఇది చేశామని, ఇప్పుడు ఇది చేస్తున్నామని, భవిష్యత్తులో ఇది చేస్తామని చెప్పడానికి ఏంలేదన్నారు.

అసలు పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం నాకు ఎక్కడిది?
ఎంపీలను ఎలా కొందామా, పక్క పార్టీ వారిని ఎలా కొందామా అనే ఆలోచన టీడీపీది అన్నారు. రాని వాళ్లపై ఎలా బురదజల్లుదామా అని చూస్తున్నారన్నారు. టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు తాను పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలోకి వెళ్లే అవసరం ఏముందో ప్రజలు ఆలోచించాలన్నారు.

ఆంధ్రజ్యోతి సర్వే చూస్తుంటే...
అలాగే, తమ పార్టీ అధినేత వైయస్ జగన్ తాము వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, ప్రజల ప్రయోజనాల కోసమే పని చేస్తామని పదేపదే చెబుతున్నప్పటికీ ఆయనపై బురద జల్లుతున్నారన్నారు. ఆంధ్రజ్యోతి సర్వే చూస్తుంటే టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో క్రియేట్ చేసుకున్న సర్వేను పేపర్లలో వేసినట్లుగా కనిపించిందన్నారు.

నిన్న పెద్ద మనసుతో రోజా గెలుస్తుందని, బాబు అక్షింతలతో ప్లేటు ఫిరాయింపు
నిన్ననేమో పెద్ద మనసుతో నగరిలో రోజా గెలుస్తుందేమో అని పేపర్లో వేసిన పెద్దమనిషికి (ఆంధ్రజ్యోతి ఎండీ) పైనుంచి చంద్రబాబు నాయుడు అక్షింతలు వేయగానే ఈ రోజు ప్లేటు పిరాయించారన్నారు. నగరిలో వైసీపీకు బాగుంది కానీ, రోజా గెలవదని మళ్లీ సర్వే అంటూ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇలా ఆర్టికల్స్ రాయడం చూస్తుంటే వారికి వైసీపీని చూసి ఎంత భయం వేస్తోందో అర్థమవుతోందన్నారు.

రాజమహేంద్రవరం బ్రిడ్జి ఊగిపోయే విధంగా జగన్ వెనుక లక్షలాదిమంది
టీడీపీని తరిమి కొట్టే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను చైతన్యపరిచిందని తెలుసుకొని మాలాంటి నాయకులపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. తాము ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని, తమలాంటి వారిని ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. జగన్ వంటి నాయకుడిని 2014లో వదులుకున్నందుకే అందరూ బాధపడుతున్నారన్నారు. 2019లో సీఎం కావాలని రాజమహేంద్రవరం బ్రిడ్జి ఊగిపోయే విధంగా లక్షలాది మంది ఆయన వెనుక నడిచారన్నారు. అది చూస్తేనే టీడీపీకి అంతా అర్థమైపోయిందన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications