మరో వైసీపీ ఎంపీ అలక ? ఆ మాజీ మంత్రి స్దానంలో కొత్త ఇన్ ఛార్జ్ ప్రకటనతో !
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పులు సిట్టింగ్ నేతల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. పలు చోట్ల ఇదే కారణంతో సీట్లు కోల్పోతున్న వారు పార్టీలు మారేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ ప్రకటించిన ఆరో జాబితాలో చేపట్టిన ఓ ఇన్ ఛార్జ్ మార్పు ఇప్పుడు స్ధానిక వైసీపీ ఎంపీ ఇన్ ఛార్జ్ కు ఇబ్బందికరంగా మారిపోయింది. తనకు మాట మాత్రమైనా చెప్పకుండా అధిష్టానం ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై సదరు ఎంపీ అలిగారు. అంతటితో ఆగకుండా పార్టీ క్యాడర్ కు కార్యక్రమాలు ఆపాలని ఆదేశాలు కూడా పంపినట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రకటించిన ఆరో జాబితాలో నెల్లూరు సిటీ స్ధానంలో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీగా పంపి, ఆయన స్ధానంలో డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ ను ఇన్ చార్జ్ గా నియమించారు. అంటే బీసీ నేతను తప్పించి ఆయన స్దానంలో మైనార్టీకి అవకాశం ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఇదే అంశం వైసీపీ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ గా ఉన్న సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంట పుట్టిస్తోంది.

నెల్లూరు సిటీ స్ధానంలో ఇన్ ఛార్జ్ మార్పు తప్పదని గత వారమే తెలిపోయింది. నరసరావు పేట ఎంపీ స్ధానంలో ఈసారి బీసీ అభ్యర్ధికి అవకాశం ఇవ్వాలని భావించిన అధిష్టానం.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను అక్కడికి వెళ్లాలని ఆదేశించింది. అంతవరకూ బాగానే ఉన్నా.. ఆయన స్ధానంలో మరో బీసీ అభ్యర్ధికి అవకాశం ఇవ్వకుండా మైనార్టీకి ఇవ్వడంపై స్ధానికంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో నెల్లూరు సిటీ స్ధానంలో తన భార్య ప్రశాంతిరెడ్డికి అవకాశం దక్కుతుందని ఆశ పెట్టుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈ పరిణామాలతో షాక్ తగిలింది.
Recommended Video

దీనిపై అసంతృప్తిగా ఉన్న వేమిరెడ్డి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉంటూనే అక్కడి నుంచే అనుచరులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలు ఆపాలని ఆయన నేతలకు సంకేతాలు పంపారు. దీంతో వారంతా పార్టీ కార్యక్రమాల్ని తాత్కాలికంగా ఆపేశారు. దీంతో అధిష్టానం ఇప్పుడు వేమిరెడ్డిని బుజ్జగించే పనిలో పడింది.












Click it and Unblock the Notifications