• search
  • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యూహం మార్చిన వైసీపీ - టార్గెట్ ఢిల్లీ : చంద్రబాబు - పవన్ ను ఫిక్స్ చేసేలా...!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పొత్తుల అంశం పైన అధికారికంగా క్లారిటీ రాకపోయినా..అనధికారికంగా ఏం జరగబోతోందనే సంకేతాలు మాత్రం క్లియర్ గా ఉన్నాయి. వైసీపీ..సీఎం జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహాలు - పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ సైతం అలర్ట్ అయింది. ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొంటూనే..ఇప్పటి వరకు బీజేపీ విమర్శలకు పెద్దగా రియాక్ట్ కాని వైసీపీ..ఇప్పుుడు స్టాండ్ మర్చింది. తమ ప్రభుత్వం పైన ఏపీకి వచ్చి విమర్శలు చేస్తే వెంటనే తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తోంది.

విమర్శిస్తూ ఉపేక్షించేది లేదు

విమర్శిస్తూ ఉపేక్షించేది లేదు

బీజేపీ చీఫ్ నడ్డా విజయవాడ.. రాజమండ్రి వేదికగా చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. అదే సమయంలో కేంద్రం అప్పుల విషయంలో ఏం చేస్తోందని నిలదీసారు. అసలు ఈ ఎనిమిదేళ్ల కాలంలో దేశానికి జరిగిన ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకం ఎక్కడుందని జేపీ నడ్డాను ప్రశ్నించారు. ఆత్మకూరు ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉంటారో తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇక, రానున్న రోజుల్లో ఏపీకి రావాల్సిన ప్రయోజనాల పైన కేంద్రాన్ని నేరుగా ప్రశ్నించేందుకు వైసీపీ సిద్దం అవుతోంది.

టీడీపీ - జనసేన ను ఫిక్స్ చేసేలా

టీడీపీ - జనసేన ను ఫిక్స్ చేసేలా


అదే సమయంలో బీజేపీతో స్నేహం కోరుకుంటున్న టీడీపీ - జనసేన పార్టీలను ఢిఫెన్స్ లో పడేయాలని యోచిస్తోంది. బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో జత కట్టే అవకాశాలు కనిపించటం లేదు. అదే సమయంలో టీడీపీ మాత్రం బీజేపీ - జనసేన రెండు పార్టీలతోనూ వేచి చూసే ధోరణితోనూ ఉంది. ఆ రెండు పార్టీలతో కలిసే ముందుకెళ్లాలనే వ్యూహంతో వేచి చూస్తోంది. ఇప్పుడు వైసీపీ నేరుగా బీజేపీ అధినాయకత్వాన్ని ప్రశ్నించటం ద్వారా...టీడీపీ - జనసేన పైనా ఒత్తిడి పెంచటం వైసీపీ వ్యూహంగా ఉందనేది విశ్లేషకుల అంచనా. 2019 ఎన్నికల ముందు ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అధినేత జగన్ ఇదే విధంగా వ్యవహరించి..తన రాజకీయ ఉచ్చులో టీడీపీ చిక్కుకొనేలా చేయటంలో సక్సెస్ అయ్యారు.

టార్గెట్ 2024 వ్యూహంలో భాగంగా..

టార్గెట్ 2024 వ్యూహంలో భాగంగా..


ఫలితంగా టీడీపీ.. బీజేపీకి దూరం కావటం.. 2019 ఎన్నికల్లో ఒంటి పోరాటం చేయాల్సి వచ్చింది. కేంద్రాన్ని ప్రశ్నించటం ద్వారా ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలనేది వైసీపీ లక్ష్యం. అదే సమయంలో టీడీపీ - జనసేన కేంద్రాన్ని ప్రశ్నించేలా ఒత్తిడి పెంచగలిగితే..రాజకీయంగా వారి ముగ్గురి కలయిక సాధ్యపడే అవకాశం ఉండదు. ఇక, తమ ప్రభుత్వం - పార్టీని విమర్శిస్తున్న బీజేపీని విస్మరిస్తే..ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయనేది వైసీపీ నేతల వాదన. దీంతో..ముందుగా తమ ప్రభుత్వం పైన బీజేపీ నేతలు విమర్శలు చేస్తే మాత్రం మౌనంగా ఉండే పరిస్థితి లేదని వైసీపీ ముఖ్య నేతలు తేల్చి చెబుతున్నారు.

English summary
YRCP Change political strategy, decided to target BJP. YCP leaders planning to fix TDP and Janasena in AP Politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X