బీచ్ ఫెస్టివెల్‌ను నిరసిస్తూ వైసిపి ఆందోళన
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కామాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారంటూ కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ స్టూడెంట్ ఫెడరేషన్ నేతృత్వంలో పలు విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఏడు రోడ్ల కూడలిలో ప్రభుత్వానికి వ్యతికేఖంగా నినాదాలు చేస్తూ విదేశీ సంస్కృతి వద్దు, స్వదేశీ సంస్కృతి ముద్దు అంటూ నినదించారు. విశాఖలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్పడం భారత సంస్కృతిని దెబ్బతీయడం కాదా అని నిలదీశారు. రాష్ట్ర ప్రతిష్టను అప్రతిష్టపాలు చేసేందుకు బార్లు, మద్యం షాపులు తెరిచేందుకు సిద్ధమయ్యారని దుమ్మెత్తి పోశారు. ఫిబ్రవరిలో జరగబోయే బీజ్ ఫెస్టివల్ ను అన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకుంటాయని నేతలు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications