ఢిల్లీలో ఉద్యమం వేళ.. జగన్ అనూహ్యం: కాంగ్రెస్‌కు జై?

YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న దాడులు, హత్యలు, అత్యాచారాలపై దేశ రాజధానిలో ఉద్యమించడానికి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమౌతోంది.

50 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కేంద్రానికి వివరించాలని, ఈ పోరాటానికి క‌లిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొంటామంటూ వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం ఢిల్లీలో నిర్వహించే ధర్నాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పాల్గొనబోతోన్నారు.

YSRCP support to the India bloc demand in Lok Sabha deputy Speaker

ఈ నేప‌థ్యంలో ఉద‌యం గ‌న్న‌వ‌రం నుంచి బ‌య‌లుదేరిన వైఎస్ జ‌గ‌న్.. ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆయనకు పార్టీ నేత‌లు, అభిమానులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండ‌నున్నారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను వివ‌రించేందుకు ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్లు కోరారు.

రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి 11 మంది సభ్యుల బలం ఉంది. లోక్‌సభ తరహాలోనే ఇక్కడా తన సంఖ్యాబలాన్ని కోల్పోయింది బీజేపీ. బిల్లులు ఆమోదం పొందాలంటే మిత్ర పక్షాలు లేదా తటస్థ పార్టీలకు చెందిన సభ్యుల ఓట్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే..రాజ్యసభలో అధికార ఎన్డీఏ పక్షం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు ఇస్తామంటూ ఇటీవలే విజయసాయిరెడ్డి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అదే వైఖరిని కొనసాగించాలంటూ మొన్నటి పార్లమెంటరీ పార్టీ భేటీలో వైఎస్ జగన్ కూడా తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో సాయిరెడ్డి.. అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

అదే సమయంలో అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ అనూహ్యంగా ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు మద్దతు పలికింది. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి కేటాయించాలంటూ గళమెత్తింది. ఈ విషయంపై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రస్తావించనుంది.

డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగా ఉంటోందని, దీన్ని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమికి దక్కాలంటూ విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే విషయాన్ని ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ డిమాండ్ చేశామని అన్నారు. అధికార పక్షానికి స్పీకర్, ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలనేది సభా సంప్రదాయమని, అది ఆనవాయితీగా వస్తోందని సాయిరెడ్డి గుర్తు చేశారు.

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా తెలుగుదేశం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌ను నామినేట్ చేయాలంటూ ప్రతిపాదించడం వల్లే వైఎస్ఆర్సీపీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. టీడీపీ మాత్రం దీన్ని తోసిపుచ్చింది. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కేటాయించనున్నట్లు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+