Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పులివెందుల, ఒంటిమిట్టపై సుప్రీంకు..! వైసీపీ కీలక నిర్ణయం..!

ఏపీలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కూ, కౌంటింగ్ కూ మధ్య ఓట్ల తేడాపై ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్న వైసీపీ.. ఇప్పుడు తాజాగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలపై మరో పోరాటనికి సిద్దమవుతోంది. ఓవైపు బీహార్ లో ఓటర్ల జాబితాల సవరణపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుండటం, సుప్రీంకోర్టు ఈసీపై నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు.

ఇవాళ గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్వాతంత్య్ర దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన వైయ‌స్సార్సీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ యాంత్రికంగా త‌యారైన ప‌రిస్థితి క‌నిపిస్తోందని, రాజకీయ పార్టీల్లో జ‌వాబుదారీత‌నం త‌గ్గుతోందని ఆయన ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు మ‌నం జ‌వాబుదారీత‌నంతో ఉండాలన్నారు. వారికి మ‌న‌మిచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేర్చాలన్నారు.

ysrcp to approach apex court on pulivendula vontimitta polls sajjala key comments

యంత్రాల‌ను మేనేజ్ చేసి ఏమైనా చేయొచ్చ‌నే అభిప్రాయం ఈవీఎంల విష‌యంలో దేశంలో బ‌ల‌ప‌డిందని సజ్జల తెలిపారు.
ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న అనుమానాల‌కు స‌మాధానం ఉండ‌టం లేదన్నారు. మ‌న రాష్ట్రంలోనే ఓటింగ్ నిర్వ‌హించిన విధానంపై ప్ర‌జ‌ల్లో ఎన్నో అనుమానాలున్నాయని, ఓటింగ్ పూర్త‌యిన రోజు ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల శాతానికి, తుది వివ‌రాలు ఇచ్చిన దానికి ఓటింగ్ శాతంలో 12.5 శాతం తేడా ఉందని గుర్తుచేశారు. దాదాపు 50 ల‌క్ష‌లకు పైగా ఓట్లు తేడా ఉన్నాయ‌ని అడుగుతుంటే స‌మాధానం చెప్పే వ్య‌వ‌స్థ లేదన్నారు.

ఎన్నిక‌ల అరాచకాల‌పై తాము కోర్టు మెట్లెక్కితే ఆధారాలు తీసుకురావాల‌ని కోరుతుందేమో అనుకున్నామని, కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు అదీ జ‌ర‌గ‌లేదన్నారు. అయినా న్యాయ వ్య‌వ‌స్థ‌మీద పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తామని తెలిపారు. వ్య‌వ‌స్థ‌లు యాంత్రికంగా ప‌నిచేస్తున్నాయని చెప్ప‌డానికి ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించాల్సి వ‌చ్చిందన్నారు. అవ‌స‌ర‌మైతే తాము కూడా ఆ ప‌రీక్ష‌లకు సిద్ధంగా ఉన్నామ‌ని ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతున్నామన్నారు.

ysrcp to approach apex court on pulivendula vontimitta polls sajjala key comments

పులివెందుల జ‌డ్పీటీసీ ఉప ఎన్నిక‌ల విష‌యంలోనూ పెద్ద మ‌నుషులుగా ఎవ‌రు ముందుకొచ్చినా నిల‌బ‌డ‌టానికి తాము రెడీ అని, సీనియ‌ర్ జ‌ర్నలిస్టులు కావొచ్చు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కావొచ్చు సామాజిక స్పృహ ఉన్నవారు, న్యూట్ర‌ల్ గా ఉన్న ఎవ‌రైనా కావొచ్చన్నారు. ఎలాగూ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వ‌రు కాబ‌ట్టి 15 బూత్‌లు ఉన్న ఊర్ల‌లోకి నేరుగా వెళ్లాలని, ఎంత‌మంది వేలికి సిరా చుక్క ఉందో చూడాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+