వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ వర్సెస్ టీడీపీ .. కంచె సీన్ రిపీట్ .. టీడీపీ వాళ్ళు రావద్దని అడ్డుగోడ కట్టిన వైసీపీ

|
Google Oneindia TeluguNews

దర్శకుడు క్రిష్ జాగర్లముడి నిర్మించిన 'కంచె' చాలా ఆలోచించదగిన సినిమాల్లో ఒకటి. ఇది సమాజంలో కులాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల నేపధ్యంలో ఒక వూరి మధ్యలో కంచె నిర్మించడం ద్వారా ప్రజలు ఇతరులతో ఎలా విభేదిస్తారు అనే అంశాన్ని తెలియజేస్తుంది. . ప్రపంచం పరివర్తన చెందుతున్నప్పుడు కుల ఉనికిని కూడా ఇది ప్రశ్నిస్తుంది. ఇక ఏపీలో ఎన్నికలు ముగిశాక కంచె సీన్ రిపీట్ అయ్యింది . ఇక అదే ఎపిసోడ్ గుంటూరు జిల్లాలో పునరావృతమైంది.

కాళేశ్వరానికి వ్యతిరేకంగా జలదీక్ష చేశావ్, కేసీఆర్ హిట్లర్ అన్నావ్ .. ఇప్పుడు ఎలా వెళ్తావ్ జగన్కాళేశ్వరానికి వ్యతిరేకంగా జలదీక్ష చేశావ్, కేసీఆర్ హిట్లర్ అన్నావ్ .. ఇప్పుడు ఎలా వెళ్తావ్ జగన్

టీడీపీ సానుభూతిపరులు ప్రార్ధనా మందిరానికి వెళ్ళకుండా గోడ కట్టిన వైసీపీ కార్యకర్తలు

టీడీపీ సానుభూతిపరులు ప్రార్ధనా మందిరానికి వెళ్ళకుండా గోడ కట్టిన వైసీపీ కార్యకర్తలు

వైయస్ఆర్సిపి మద్దతుదారులు తెలుగు దేశం మద్దతుదారులపై దాడులు కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం టీడీపీకి ఓటేశారన్న కక్షతో పలువురు రైతులను గ్రామం నుంచి బహిష్కరించిన వైసీపీ నాయకులు ఇప్పుడు తాజాగా రహదారికి అడ్డంగా గోడ కట్టారు. ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో టీడీపీ కార్యకర్తలు అక్కడికి దగ్గరలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లే మార్గంలో అడ్డుగా గోడ నిర్మించారు వైసీపీ మద్దతుదారులు . ఇక వైసీపీ కార్యకర్తలు నిర్మించిన గోడ టిడిపి సానుభూతిపరులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అసౌకర్యంగా మారింది. ఈ దారుణంపై టీడీపీ కార్యకర్తలు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. సమస్యను తేలికగా తీసుకోవడంతో టిడిపి నాయకులు పోలీసులను ఆశ్రయించారు . కానీ అప్పటికి వైయస్ఆర్సిపి మద్దతుదారులు నాలుగు అడుగుల గోడను పెంచారు.

గ్రామంలో పికెటింగ్ పెట్టిన పోలీసులు .. పరిస్థితి అదుపులోకి తెచ్చే యత్నం

గ్రామంలో పికెటింగ్ పెట్టిన పోలీసులు .. పరిస్థితి అదుపులోకి తెచ్చే యత్నం

దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గోడ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. రెండు వర్గాల మధ్య అవాంఛిత ఘర్షణ జరగకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉద్రిక్తత చోటు చేసుకోకుండా ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు పోలీసులు .

హోం మంత్రి ప్రకటన చేసి 24గంటలు కూడా గడవకముందే టీడీపీపై కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు

హోం మంత్రి ప్రకటన చేసి 24గంటలు కూడా గడవకముందే టీడీపీపై కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు

ఒకపక్క టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ కార్యకర్తలపై జరగుతున్న దాడులను ఖండిస్తుంది . ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు అమానుషంగా దాడులకు తెగబడుతున్నాయని ఆరోపిస్తుంది . ఈ దాడుల్లో అనేక మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నాయకులు . మరో పక్క రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులపై హోం మంత్రి ప్రకటన చేసిన 24 గంటలకే అనంతపురం సింగనమలలో వైసీపీ నేతలు పంటలు ధ్వంసం చేశారని, అడ్డు గోడ కట్టారని వరుస ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నాయకులు .

English summary
The YSRCP supporters are continuing their attacks on Telugu Desam supporters. In a fresh episode, YSRCP folks have reportedly constructed a wall on the road which will disable TDP sympathisers from reaching a praying room which is a church like, located close to Firangipuram. The TDP supporters have complained over this to the officials. But with the officials taking the issue light, TDP has approached the police. But by then the YSRCP supporters have raised a four feet wall. A police picket was set up so as no unwanted clash will take place between the two sides and also stopped the construction works of wall. Also the police of calling key members from both TDP and YSRCP to settle the issue. This is a disgusting act by YSRCP by blocking not just TDP supporters but also the normal public.Hope the police will find a solution and make peace!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X