తప్పుడు కేసులు పెట్టారని.. జగన్ పార్టీ యువనేత ఆత్మహత్య
తూర్పుగోదావరి: పోలీసులు తప్పుడు కేసు పెట్టారని మనస్తాపం చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నేత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అమలాపురం పట్టణానికి చెందిన వాసిశెట్టి సుభాష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువత విభాగం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. యువతలో సుభాష్‌కు వస్తున్న క్రేజ్‌ను తట్టుకోలేని అధికార పార్టీ నాయకులు సుభాష్‌పై తప్పుడు కేసులు నమోదు చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత విభాగం నేతలు ఆరోపించారు.
దీంతో మనస్తాపానికి గురైన సుభాష్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేశారు. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.\

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి
గుంటూరు: గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి చెందడంతో స్థానికులు విషాదంలో మునిగి పోయారు. వివరాల్లోకి వెళితే.. రొంపిచర్ల మండలం గోగులపాడు దగ్గర రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు ఈపూరు మండలం బొగ్గవరం గ్రామానికి చెందిన రమేష్, గోగులపాడుకు చెందిన వంగయ్య అని పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications