జోస్యం చెప్పిన ఏపీ బీజేపీ నేత సత్యకుమార్..!!
Satya Kumar: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల మలి విడత ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా మూడు లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించింది. 11 మందితో ఇదివరకే తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే.
ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. మలి జాబితాలో అన్ని కులాల వారికీ ప్రాతినిధ్యం కల్పించడం విశేషం.

ఈ రెండో జాబితాపై భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్‌తో పాటు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వాన్ని తప్పుపట్టారు. నియోజకవర్గాల మార్పులు చేర్పులపై ఎలాంటి ఫలితం ఉండబోదనీ జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే మార్పులకు పూనుకుందని ధ్వజమెత్తారు.
ఈ జాబితాను కొత్త సీసాలో పాత సారాగా అభివర్ణించారాయన. వైఎస్ జగన్ మార్కు అభ్యర్థుల మార్పుగా వ్యాఖ్యానించారు. కొత్త సీసాలో పాతా సారా నింపారే తప్ప.. దీనివల్ల ఉపయోగం ఉండదని అన్నారు. ఒక స్థానంలో అసమర్థుడైన నాయకుడు మరో సీటులో సమర్థుడు అవుతాడా? అంటూ ప్రశ్నించారు.
ఒక నియోజకవర్గంలో అవినీతికి పాల్పడిన అభ్యర్థి.. మరో స్థానంలో పునీతుడు కాలేడని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో అరాచకవాదిగా గుర్తింపు పొందిన వాళ్లు.. అదే అసెంబ్లీలోమహాత్మాగాంధీ అవుతాడా? అంటూ నిలదీశారు. తండ్రి పనికిరాని వాడైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కొడుకు పనిమంతుడు కాలేడని అన్నారు.












Click it and Unblock the Notifications