AP Assembly: మళ్లీ జగన్ తో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు..! ఈక్వేషన్ మారుతోందా?
ఏపీలో గతంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పుడు విపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పాత నిర్ణయాల్ని సమీక్షించుకుంటారా ?, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారం చేజారిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఇద్దరు ప్రజాప్రతినిధుల్ని తిరిగి పార్టీలోకి తీసుకుంటారా?, అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీలో వాళ్ల మాటలు విని వీరిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తేస్తారా ? ఇవాళ అసెంబ్లీకి జగన్ తో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు (ysrcp mlcs) కనిపించి చర్చకు తెరలేపారు.
గతంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎంపికై, ఫామ్ లో ఉన్న సమయంలో అనూహ్యంగా డ్రైవర్ ను హత్య చేసిన కేసులో ఇరుక్కుని, జైలు జీవితం కూడా అనుభవించిన అనంతబాబుపై అప్పట్లో సస్పెన్షన్ వేటు పడింది. అప్పట్లో అధికారంలో ఉన్న జగన్.. విపక్షాల విమర్శలకు తోడు, సొంత పార్టీ నేతల ఒత్తిడితో ఈ వేటు వేశారు. అయితే అధికారికంగా వేటు పడినా అనంతబాబు మాత్రం వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా జగన్ తో కలిసి ఆయన అసెంబ్లీలో నిరసనల్లో పాల్గొన్నారు.

అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. తన భార్య వాణిని వదిలేసి ప్రియురాలు దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్న క్రమంలో కుటుంబ విభేదాలు రోడ్డుకెక్కాయి. వాణి, తన కుమార్తెలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి చేసిన రచ్చ తర్వాత ఆయనపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తనపై శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన సోదరుల ఒత్తిడితోనే పార్టీ వేటు వేసిందని ఆయన కూడా పలుమార్లు చెప్పుకున్నారు. ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ అనూహ్యంగా జగన్ ను అసెంబ్లీకి వచ్చి కలిశారు. అసెంబ్లీ నుంచి వైసీపీ ప్రజాప్రతినిధులు బాయ్ కాట్ చేస్తున్న క్రమంలో జగన్ తో కలిసి ఏదో మాట్లాడుతూ ఆయన బయటికి వస్తుండటం కనిపించింది. ఈ రెండు పరిణామాలతో వీరిద్దరినీ తిరిగి పార్టీలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పచెప్పేందుకు జగన్ సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications