Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెడ్లకు ఓ రూల్- రాజులకు ఓ రూలా ? ఆరె శ్యామల ట్వీట్..!

ఏపీలో గత వైసీపీ హయాంలో జరిగిన టీటీడీ పరకామణి చోరీ వ్యవహారం మరోసారి రాజకీయ మాటల యుద్దానికి కారణమవుతోంది. ఈ చోరీ చేసిన టీటీడీ ఉద్యోగి రవికుమార్ తో ఫిర్యాదుదారు అయిన టీటీడీని లోక్ అదాలత్ లో రాజీ చేయించిన వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరడంతో దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర మాటల యుద్దం సాగుతోంది. ఇందులో భాగంగా పరకామణి చోరీతో సంబంధం లేని అప్పటి టీటీడీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని లాగడంపై వైసీపీ పైర్ అవుతోంది.

టీటీడీ పరకామణిలో జరిగిన చోరీకి టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని బాధ్యుల్ని చేస్తున్న కూటమి సర్కార్.. మరోవైపు సింహాచలం ఆలయ హుండీలో జరిగిన మరో చొరీ కేసులో మాత్రం ఆలయ ధర్మకర్త అయిన ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును వదిలేయడాన్ని వైసీపీ తప్పుబడుతోంది. ఇదే విషయాన్ని నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తావించగా.. ఇవాళ పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల దీనికి కులాల రంగు అంటిస్తూ విమర్శలకు దిగారు.

YSRCP s Syamala Questions Chandrababu government s Justice Disparity Between Reddys and Rajus

రాజు గారికి" ఒక న్యాయం -"రెడ్డి గారికి" మరొక న్యాయమా ? అంటూ వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ప్రశ్నించారు. పరకామణిలో దొంగతనం జరిగితే , టీటీడీ చైర్మన్లుగా ఉన్న సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిపై నిందలు వేస్తారా ?సింహాచలం హుండీలో దొంగతనం జరిగితే దేవస్థానం చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు గారిని అందలం ఎక్కిస్తారా??? మనలో మన మాట .. పరకామణిలో రూ .72 వేల విలువైన డాలర్లను దొంగతనం చేసిన వ్యక్తి నుంచి , న్యాయ మూర్తుల సలహా మేరకు , రూ .14 కోట్ల విలువైన ఆస్తిని టీటీడీ పేరిట రాయించారన్నారు.

YSRCP s Syamala Questions Chandrababu government s Justice Disparity Between Reddys and Rajus

మరి సింహాచలం దేవస్థానం హుండీలో రూ.55 వేలు దొంగతనం చేసిన వ్యక్తి నుంచి ఏమైనా రికవరీ చేశారా...? దీని గురించి ఏం మాట్లాడరు ఎందుకని శ్యామల ప్రశ్నించారు. పైగా ఈ రోజు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల కొండలు 7 కాదు.., 8 అంట 8వది చెత్త కొండ అని అన్నారని గుర్తుచేశారు. దీనిపై పిఠాపురం పీఠాధిపతి PPP (పవన్ కళ్యాణ్)స్పందన ఏంటో మరి అని శ్యామల ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+