సుబ్బారెడ్డి కి జగన్ క్లాస్: ఎంపీ సీటు పై జగన్ ఏం తేల్చారు : అందుకే ఆయన ఇలా....!
వైసిపి లో కీలక పరిణామం. వైయస్ మరణం నుండి జగన్ వెంటే ఉన్న వైవి సుబ్బారెడ్డి అలిగారు. ఒంగోలు ఎంపీగా గతంలో గెలిచిన సుబ్బారెడ్డికి ఇప్పుడు సీటు పై జగన్ క్లారిటీ ఇచ్చారు. ఆయన బాధ్యత ఏంటో చెప్పేసారు. అదే సమ యంలో సుబ్బారెడ్డికి ..జగన్ ఓ క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది వైసిపి లో హాట్ టాపిక్...

సుబ్బారెడ్డి వ్యాఖ్యలే కారణమా..
వైయస్ మరణం తరువాత జగన్ కు వైవి సుబ్బారెడ్డి వెన్ను దన్నుగా నిలిచారు. జగన్ కుటుంబానికి పెద్ద దిక్కుగా వ్య వహరించారు. ఆయనకు 2014 లో జగన్ ఒంగోలు సీటు కేటాయించారు. ఆయన ఎంపీగా గెలిచారు. ఇక, వచ్చే ఎన్నిక ల్లో కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అయితే, తాజాగా ఒంగోలు సీటు విషయంలో సుబ్బా రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకల సృష్టించాయి. వచ్చే ఎన్నికట్లో ఒంగోలు లోక్‌సభ స్థానం నుండి తానే పోటీ చేస్తా నంటూ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఒంగోలు లో ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి తో సుబ్బారెడ్డికి గ్యాప్ వచ్చింది. ఇక, ఒంగోలు మాజీ ఎంపి..ప్రస్తుత టిడిపి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసిపి లో చేరుతారనుకొనే సమయంలో ఈ విధంగా సుబ్బారెడ్డి స్పందించంతో అక్కడి ప్లాన్ పై ప్రభావం చూపిందని పార్టీ నేతలు చెబుతున్నారు.

జగన్ ఆగ్రహానికి కారణం ఇదే..
లండన్ పర్యటనలో ఉన్న సమయంలో సుబ్బారెడ్డి ఒంగోలు సీటు తనదేనని చెప్పటం తో జగన్ అసమనం వ్యక్తం చేసారు. ఒంగోలు సీటు ఈ సారి టిడిపి నుండి మాగుంట వస్తే ఆయనకు లేదా మరొకరిని బరిలోకి దించే యోచనలో జగన్ ఉన్నారు. తనకు సీటు విషయం పై సుబ్బారెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన జగన్ ను కుటుంబ
సభ్యులతో సహా కలిసారు. తన కు ఒంగోలు సీటు ఇవ్వాలని కోరారు. అయితే, సీటు ఇవ్వలేమని..సొంత మనిషిగా ఉన్న మీరు ఇలా ఎందుకు వ్యాఖ్య లు చేసారని..ఆ సీటు మాగుంట వచ్చినా రాకున్నా...ఒంగోలు సీటు మాత్రం మీకు రాదని జగన్ తేల్చేసారు. పార్టీ అధికారంలోకి రావటం ముఖ్యమంటూనే..గోదావరి జిల్లాల బాద్యతల పై దృష్టి పెట్టా లంటూ సూచించారు.

గృహప్రవేశానికి దూరంగా..
జగన్ తో ఆయన కుటుంబ సభ్యులతో ఎప్పుడూ వెంటగా ఉండే సుబ్బారెడ్డి తాడేపల్లి గృహప్రవేశానికి దూరంగా ఉన్నా రు. తనకు ఒంగోలు సీటు లేదని చెప్పటం..తాను చేసిన వ్యాఖ్యల పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయటమే కారణంగా ఆ యన దూరంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా మాగుంట సైతం వైసిపి లో చేరే అంశం పై పునరాలోచనలో పడ్డారని సమాచారం. అయితే, జగన్ లండన్ నుండి తిరిగి వచ్చిన తరువాత దీని పై స్పష్టత ఇవ్వటంతో మాగుంట తిరిగి వైసిపి లోకి రావాలని నిర్ణయించారని చెబుతున్నారు. అయితే, ఎన్నికల వేళ అలిగిన సుబ్బారెడ్డి విషయంలో జగన్ ఇప్పుడు ఏం చేస్తరనేది ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications