టీడీపీని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు..!!
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలనూ తలపెట్టింది. కొవ్వొత్తుల ర్యాలీలు, ప్లకార్డుల ప్రదర్శనలు, పోస్ట్ కార్డుల ఉద్యమాలతో చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా- మోత మోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించింది. చంద్రబాబుకు మద్దతు తెలియజేస్తూ శనివారం సాయంత్రం రాత్రి 7 నుంచి 7:05 నిమిషాల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక తాజాగా- సత్యాగ్రహ దీక్షకు పూనుకోనుంది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఈ దీక్షను చేపట్టింది టీడీపీ.
దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడి జైలుకు వెళ్లిన చంద్రబాబు దీక్షను సత్యాగ్రహంతో పోల్చడం సరికాదని అన్నారు. ఇలా చేయడం అంటే సత్యాగ్రహాన్ని అపవిత్రం చేసినట్టేనని వ్యాఖ్యానించారు.
సింపతీ కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని, దానికి మహాత్ముడి పేరును వినియోగించడం అభ్యంతరకరమని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం కోసం ఎన్నో పోరాటాలు చేసి, ప్రాణాలను అర్పించిన సత్యాగ్రహాన్ని చంద్రబాబు అరెస్టుతో పోల్చడం పట్ల ఆయన మండిపడ్డారు.చంద్రబాబు దొంగతనం చేసి జైలుకు పోయాడని, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశాడని వైవీ సుబ్బారెడ్డి. దోపిడీ చేసి జైలుకు వెళ్తే దానికి సత్యాగ్రహం అని పేరు పెట్టడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఒకసారి పునరాలోచించుకోవాలని ఆయన టీడీపీకి సూచించారు.












Click it and Unblock the Notifications