యువత, విద్యార్థులకు నష్టం, హోదాపై పోరాటం ఆగదు: వైవి సుబ్బారెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతామని తెలిపారు.
గురువారం ఆయన ఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియను కలిశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీయిచ్చినట్టు గుర్తు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా రాకుంటే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. యువత, నిరుద్యోగులు చాలా నష్టపోతారని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications