YV Subba Reddy: మళ్లీ సుప్రీంకోర్టుకు..! వైవీ సుబ్బారెడ్డి కీలక నిర్ణయం..!
ఏపీలో గత వైఎస్సార్సీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందంటూ ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్ట్ నేపథ్యంలో రూటుమార్చింది. అప్పట్లో జంతువుల కొవ్వు, పందికొవ్వు నెయ్యిలో కలిసిందంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి పార్టీల నేతలు.. ఇప్పుడు నెయ్యి కల్తీని సిట్ నిర్ధారించిందంటూ ఏపీలో పోస్టర్టు వేయిస్తున్నారు. దీనిపై వైసీపీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు.
అప్పట్లో తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ చేశారంటూ ఆరోపణలు చేసిన ప్రభుత్వ పెద్దలు.. తామే సిట్ వేసి దర్యాప్తు చేయించాలని చూస్తే తాము సీబీఐ విచారణ కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీబీఐ రిపోర్ట్ రాకముందే కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సిట్ నెయ్యిలో ఏ కొవ్వూ కలవలేదని రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా వక్రీకరించి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు.

ఈ నేపథ్యంలో అప్పట్లో చేసిన దుష్ప్రచారంతో పాటు ఇప్పుడు చేస్తున్న విష ప్రచారంపైనా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. గతంలో తాము నిలిపివేసిన నాలుగు ట్యాంకర్లకు కూటమి ప్రభుత్వం అనుమతిచ్చిందని, వాటిని వేరే విధంగా లడ్డూ తయారీలో వాడిందని, ఆ నెయ్యితో లడ్డూలు చేశారని, దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications