IND vs PAK Match : కాసేపట్లో భారత్-పాక్ మ్యాచ్ - వెదర్ మ్యాన్ గుడ్ న్యూస్..

ఆసియాకప్ 2023లో భాగంగా ఇవాళ భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య కాసేపట్లో కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అసలే వారాంతం కావడంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి తరలివచ్చే అభిమానులతో పాటు ఇళ్లలోనూ టీవీలకు అతుక్కుపోయేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. అయితే ఈ మ్యాచ్ కు పొంచి ఉన్న వర్షం ముప్పు వీరందరినీ నిరాశ పరుస్తోంది.

ఇవాళ ఉదయం నుంచీ భారత్-పాక్ మ్యాచ్ కు ఆతిధ్యం ఇస్తున్న శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో గ్రౌండ్ సిబ్బంది కవర్లు కప్పి ఉంచారు. అయితే భారీ వర్షం కురవకపోవడం ఒక్కటే ఊరటగా కనిపిస్తోంది. స్ధానిక వాతావరణంపై వెదర్ మ్యాన్ ఇచ్చిన రిపోర్టులోనూ మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. దీంతో మ్యాచ్ సజావుగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Asia Cup 2023: latest weather report suggests india-pakistan match will be a full game

పల్లెకెలే స్టేడియంలో వెదర్ రిపోర్ట్ ప్రకారం ఇవాళ మ్యాచ్ పూర్తిగా జరిగే అవకాశాలు 60 శాతం ఉన్నాయి. వర్షం వల్ల ఆటంకాలు ఏర్పడి ఓవర్లు తగ్గించి మ్యాచ్ నిర్వహించే అవకాశాలు కూడా 30 శాతం ఉన్నాయి. కేవలం 10 శాతం మాత్రమే మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏదో విధంగా మ్యాచ్ సాగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం వెలువడిన రిపోర్టుల్లో మాత్రం ఈ మ్యాచ్ కు 90 శాతం వర్షం ముప్పు ఉందని తేలగా.. తాజా రిపోర్టులో 90 శాతం మ్యాచ్ జరిగే అవకాశం ఉందని తేలింది.

అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు జట్లకూ చెరో పాయింట్ లభిస్తుంది. మరోవైపు మ్యాచ్ మధ్యలో అడ్డంకులు ఏర్పడి డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (DLS) పద్ధతి ప్రకారం ఫలితం నిర్ణయించాల్సి వస్తే ఫలితం నిర్ణయించడానికి రెండు జట్లూ కనీసం 20 ఓవర్లు ఆడాలి. ఒకవేళ రెండో బ్యాటింగ్ చేసే జట్టు తన ఓవర్‌ల పూర్తి కోటాను అందుకోలేనట్లయితే, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు స్కోరు రెండో బ్యాటింగ్ చేసే జట్టుకు బౌల్ చేయాల్సిన ఓవర్ల సంఖ్యకు సంబంధించిన శాతాన్ని బట్టి లెక్కిస్తారు. కనీసం ఇలా అయినా మ్యాచ్ జరిగి డీఎల్ఎస్ పద్ధతిలో అయినా ఫలితం తేలితే బావుంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+