IND vs PAK Match : వర్షంతో ఇవాళ భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే జరిగేది ఇదే..!

ఆసియాకప్ 2023లో భాగంగా ఇవాళ భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అసలే వారాంతం కావడంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి తరలివచ్చే అభిమానులతో పాటు ఇళ్లలోనూ టీవీలకు అతుక్కుపోయేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. అయితే వీరందరినీ నిరాశ పరుస్తూ ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందనే నివేదికలు వెలువడుతున్నాయి.

ఇవాళ జరిగే ఆసియా కప్‌ భారత్‌-పాకిస్థాన్‌ల మ్యాచ్ వాష్ వర్షం వల్ల రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు వస్తున్న వార్తలు క్రికెట్ అభిమానుల్లో నిరాశ కలిగిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇవాళ శ్రీలంకలోని క్యాండీ సమీపంలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇవాళ ఉదయం 67 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు, అలాగే సాయంత్రం 94 శాతం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మ్యాచ్ ప్రారంభం కూడా ఆలస్యం కాబోతోంది.

Asia Cup 2023: What happens if India-Pakistan match washed out today?

అలాగే మ్యాచ్ మధ్యలోనూ వర్షం అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉండటంతో దీని ప్రభావం పాయింట్ల పట్టికపై ఎలా ఉండబోతోందన్న చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే టైగాప్రకటిస్తారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ రద్దు అయినా లేదా ప్రారంభం కాకపోయినా, పాయింట్లు రెండు జట్ల మధ్య సమానంగా విభజిస్తారు. అంటే భారత్, పాకిస్తాన్ రెండు జట్లకూ ఒక్కో పాయింట్‌ను వస్తుంది.

మరోవైపు మ్యాచ్ మధ్యలో అడ్డంకులు ఏర్పడి డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (DLS) పద్ధతి ప్రకారం ఫలితం నిర్ణయించాల్సి వస్తే ఫలితం నిర్ణయించడానికి రెండు జట్లూ కనీసం 20 ఓవర్లు ఆడాలి. ఒకవేళ రెండో బ్యాటింగ్ చేసే జట్టు తన ఓవర్‌ల పూర్తి కోటాను అందుకోలేనట్లయితే, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు స్కోరు రెండో బ్యాటింగ్ చేసే జట్టుకు బౌల్ చేయాల్సిన ఓవర్ల సంఖ్యకు సంబంధించిన శాతాన్ని బట్టి లెక్కిస్తారు. కనీసం ఇలా అయినా మ్యాచ్ జరిగి డీఎల్ఎస్ పద్ధతిలో అయినా ఫలితం తేలితే బావుంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+