VVS Laxman: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..!!

ముంబై: ఇంకో మూడు రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఆసియాకప్ టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. శ్రీలంక, పాకిస్తాన్‌లల్లో మ్యాచ్‌లన్నీ షెడ్యూల్ అయ్యాయి. బుధవారం తొలి మ్యాచ్ జరగబోతోంది. ఈ గేమ్‌లో పాకిస్తాన్, నేపాల్ తలపడనున్నాయి. పాకిస్తాన్‌లోని ముల్తాన్ దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నేపాల్.. ఈ టోర్నమెంట్ ఆడనున్నాయి.

దీని తరువాత భారత జట్టు ఆసియా గేమ్స్‌లో పాల్గొంటుంది. చైనాలోని హౌంగ్ఝౌలో ఆసియా గేమ్స్ జరుగనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆసియా గేమ్స్ జరుగనున్నాయి. ఇది టీ20 ఫార్మట్. ఇందులో మహిళలతో పాటు పురుషుల భారత క్రికెట్ జట్టు పాల్గొంటుంది.

 VVS Laxman

పురుషుల క్రికెట్ జట్టు ఆసియా గేమ్స్‌లో ఆడటానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై బీసీసీఐ ఇదివరకే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆసియా గేమ్స్‌లో పాల్గొనబోయే జట్టును సైతం ఇప్పటికే ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును చైనాకు పంపించనుంది. మరో అయిదుమంది ప్లేయర్లను కూడా స్టాండ్‌బైగా తీసుకుంది.

ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడు. హైదరాబాదీ స్టార్ బ్యాటర్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న తిలక్ వర్మకు జట్టులో చోటు దక్కింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, వికెట్ కీపర్లు జితేష్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రవి బిష్ణోయ్.. వంటి టీ20 స్పెషలిస్టులను జట్టులోకి తీసుకుంది.

ఆసియా గేమ్స్‌లో మ్యాచ్‌లను ఆడబోయే భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ అపాయింట్ అయ్యారు. టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలను మునీష్ బాలికి అప్పగించింది బీసీసీఐ. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదే ఆసియా గేమ్స్ ఆడబోయే భారత్ మహిళా జట్టుకు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ హృషికేష్ కనిత్కర్.. హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌గా రజీబ్ దత్తా, శుభదీప్ ఘోష్ నియమితులయ్యారు. భారత్ తరఫున 34 వన్డే ఇంటర్నేషనల్స్, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాడు కనిత్కర్.

ఆసియా గేమ్స్ ఆడే జట్టులో- రుతురాజ్ గైక్వాడ్ (కేప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ , అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్) ఉన్నారు. స్టాండ్‌బైగా- యష్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్ సెలెక్ట్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+