వెడ్డింగ్ ఫొటోషూట్..వెరైటీ: క్రికెటర్‌తో లవ్ మ్యారేజ్:పెళ్లి దుస్తుల్లో బ్యాట్ పట్టి..క్రీజ్‌లో
ఢాకా: పెళ్లి దుస్తుల్లో బ్యాట్ పట్టి మెరుపులు మెరిపిస్తోందా క్రికెటర్. తల నుంచి అరికాలి వరకు సంప్రదాయబద్ధ వస్త్రధారణలో కనిపిస్తోన్న ఆమె పేరు సంజిదా ఇస్లాం. బంగ్లాదేశ్ క్రికెటర్. జాతీయ మహిళా జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. కుడి చేతివాటం బ్యాట్స్ విమెన్. బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వెన్నెముక. ఇప్పుడామె ఇలా పెళ్లి దుస్తుల్లో బ్యాట్ చేత పట్టుకుని, క్రీజ్‌లో దిగడానికి కారణం లేకపోలేదు. ఇది ఆమె వెడ్డింగ్ ఫొటోషూట్. బంగ్లాదేశ్ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మిమ్ మొసాడ్డెక్‌ను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు.
Dress ✅
— ICC (@ICC) October 21, 2020
Jewellery ✅
Cricket bat ✅
Wedding photoshoots for cricketers be like ... 👌
📸 🇧🇩 Sanjida Islam pic.twitter.com/57NSY6vRgU
వారిది ప్రేమ వివాహం. నిఖాకు సిద్ధమౌతోన్న తరుణంలో ఆమె బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లోకి దిగి ముచ్చటైన్ షాట్లను ఆడటానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంజిదా ఇస్లాం వెడ్డింగ్ ఫొటోషూట్ ఫొటోలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్వయంగా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. డ్రెస్, జ్యువెలరీ, క్రికెట్ బ్యాట్.. వెడ్డింగ్ ఫొటోషూట్ ఫర్ క్రికెటర్స్ బీ లైక్ సూపర్ అంటూ కామెంట్ జత చేసింది. ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. దాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రీట్వీట్ చేసింది.
A wedding photoshoot that has bowled us over 📷 🏏
— ESPNcricinfo (@ESPNcricinfo) October 21, 2020
Bangladesh 🇧🇩 international Sanjida Islam strikes quite a pose. She got married to Mim Mosaddeak, a first-class cricketer from Rangpur.
(Photos: @ProthomAlo) pic.twitter.com/52jNxhmedu
ఇప్పటిదాకా 16 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను ఆడారు సంజిదా ఇస్లాం. 54 టీ20 మ్యాచ్‌ల్లో జట్టుకు ప్రాతనిథ్యాన్ని వహించారు. 16 వన్డేల్లో 174 పరుగులు చేశారు. 54 టీ20 మ్యాచుల్లో 520 పరుగులను సాధించారు. టీ20ల్లో ఆమె అత్యధిక వ్యక్తిగత స్కోరు 74 నాటౌట్. 2014లో ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టారు. పాకిస్తాన్ జాతీయ మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆడారు.

మహిళల ఆసియా కప్ టోర్నమెంట్ టైటిల్‌ను గెలిచిన బంగ్లాదేశ్ జాతీయ జట్టులో ఆమె సభ్యురాలు. ఆ మ్యాచ్‌లో సంజిదా ఇస్లాం రాణించారు. బంగ్లాదేశ్ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మిమ్ మొసాడ్డెక్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇప్పుడు నిఖా చేసుకోనున్నారు.
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications