బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో కరోనా బీభత్సం.. ఏకంగా 125 కంటైన్‌మెంట్ జోన్‌లు; బొమ్మనహళ్లిలో అత్యధికం

|
Google Oneindia TeluguNews

కర్ణాటక రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ (BBMP) జారీ చేసిన డేటా ప్రకారం, జనవరి 2 నాటికి బెంగళూరు నగరం అంతటా మొత్తం 125 కోవిడ్ -19 కంటైన్‌మెంట్ జోన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. గత వారంలో నగరంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల మధ్య, కంటైన్‌మెంట్ జోన్‌ల సంఖ్య డిసెంబర్ 26, 2021న 98 కంటైన్‌మెంట్ జోన్‌ల నుండి జనవరి 2, 2022 నాటికి 125 జోన్‌లకు పెరిగినట్లు డేటా చూపిస్తుంది.

బొమ్మనహళ్లిలో అత్యధికంగా 38 కంటైన్‌మెంట్ జోన్‌లు

బొమ్మనహళ్లిలో అత్యధికంగా 38 కంటైన్‌మెంట్ జోన్‌లు


బొమ్మనహళ్లిలో 38, బెంగళూరు సౌత్‌లో 15, మహదేవపూర్‌లో 35, బెంగళూరు ఈస్ట్‌లో 12, ​​బెంగళూరు వెస్ట్‌లో 10, యలహంకలో 11, దాసరహళ్లిలో మూడు, ఆర్‌ఆర్‌నగర్‌లో ఒక కంటైన్‌మెంట్ జోన్‌లు ఉన్నాయి. బెంగళూరులో ప్రస్తుతం 93 వార్డులు ఉన్నాయి, వీటిలో గత 10 రోజుల్లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడు రోజులలో సానుకూలత రేటు 1.22%గా ఉంది. ఇది డిసెంబర్ 26, 2021న నివేదించబడిన 0.54% నుండి పెరిగింది. అయితే, బెంగళూరులో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య పెద్దగా పెరగలేదు.

బెల్లందూరు వార్డులో గత పదిరోజుల్లో అత్యధిక కేసులు

బెల్లందూరు వార్డులో గత పదిరోజుల్లో అత్యధిక కేసులు

గడచిన 10 రోజుల్లో అత్యధిక కేసులు బెల్లందూరు వార్డులో నమోదయ్యాయి. గత 10 రోజుల్లో 26 కేసులు బెల్లందూరు వార్డులో , దొడ్డ నెక్కుండి వార్డులో గత 10 రోజుల్లో 11 కేసులు నమోదయ్యాయి. హగడూరు, హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌, అరకెరె వార్డుల్లో గడిచిన 10 రోజుల్లో ఒక్కొక్కటి చొప్పున 10 కేసులు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.

సోమవారం, కర్ణాటకలో మరో 10 ఒమిక్రాన్ కేసుల నమోదు

సోమవారం, కర్ణాటకలో మరో 10 ఒమిక్రాన్ కేసుల నమోదు

ఇదిలా ఉండగా, జనవరి 3, సోమవారం, కర్ణాటకలో ఓమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ యొక్క మరో పది కేసులు కనుగొనబడినట్లు ఆరోగ్య మంత్రి కె సుధాకర్ తెలిపారు. కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో కఠిన ఆంక్షలను విధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ఓమిక్రాన్ సంఖ్య 76కి చేరింది. బెంగళూరులో 8 కేసులు (వీటిలో 5 అంతర్జాతీయ ప్రయాణికులు), ధార్వాడ్ లో 2 కేసులు నమోదయినట్లు గా తెలుస్తుంది. దేశంలో ఓమిక్రాన్ కేసులు మొదటిసారిగా డిసెంబర్ 2న కర్ణాటక రాష్ట్రంలో కనుగొనబడ్డాయి .

వ్యాక్సిన్లు తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ వేరియంట్

వ్యాక్సిన్లు తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ వేరియంట్


కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం, పది కొత్త కేసులలో, ఇద్దరు పిల్లలు మరియు మిగిలిన వారందరూ కోవిడ్-19 వ్యాక్సిన్‌తో పూర్తిగా టీకాలు వేసిన పెద్దలుగా తెలుస్తుంది. ఈ కేసులలో అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. యూఎస్ఏ నుండి 19 ఏళ్ల వ్యక్తి, బెల్జియం నుండి 40 ఏళ్ల మహిళ, దుబాయ్‌కి చెందిన 46 ఏళ్ల వ్యక్తి, దుబాయ్‌కి చెందిన ఇద్దరు 49 ఏళ్ల మహిళలు ఉన్నారు. చాలా కేసులు ప్రస్తుతం లక్షణం లేనివి. బాధితులు ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ కేసులన్నింటికీ ప్రాథమిక మరియు ద్వితీయ పరిచయాలు కనుగొనబడ్డాయి . వారి నమూనాలను పరీక్షిస్తున్నారు.

English summary
Corona cases rise in Bengaluru .As on January 2, a total of 125 Covid-19 Containment Zones have been set up across the city of Bengaluru according to data released by the Greater Bengaluru Metropolitan Corporation (BBMP).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X