పోలీస్ స్టేషన్ లో సైనెడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు, బంగారు నగలు!
బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హొన్నావర్‌లో ఓ వ్యక్తి పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడంతో ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనం కేసులో విచారణ నిమిత్తం ఓ వ్యక్తిని హొన్నావర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
మృతుడు 35 సంవత్సరాల వయస్సు గలవాడు, బీహార్‌కు చెందినవాడు మరియు జీవనోపాధి కోసం తన తండ్రితో కలిసి కర్ణాటకకు వచ్చాడు. ఇద్దరూ బంగారు ఆభరణాలను పాలిష్ చేసే పని చేస్తున్నారు. దొంగతనం కేసులో విచారణకు అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా ఆ సమయంలో సైనైడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హొన్నావర్ పట్టణంలోని సాలెహిట్టాలలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురైన కేసు విచారణలో మృతుడు, అతని తండ్రిని పోలీసులు పట్టుకున్నారు. బంగారు నగలు ఇప్పిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ప్రజల నుంచి ఫిర్యాదు అందింది. అందుకే ఫిర్యాదు మేరకు విచారణకు తీసుకొచ్చామని పోలీసులు తెలిపారు.
విచారణలో నిందితుడు తాగునీటి కోసం సంచిలో తెచ్చుకున్న సైనైడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలియగానే మంగళూరు ఐజీపీ చంద్రగుప్తా ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.
అనంతరం హొన్నావర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మంజునాథ్, సబ్ ఇన్‌స్పెక్టర్ మంజేశ్వర్ చందవర్, పోలీస్ కానిస్టేబుళ్లు సంతోష్, రమేష్ లంబాని, మహవీర్‌లను సస్పెండ్ చేశారు. మృతదేహాన్ని హొన్నావర్ తాలూకా ఆసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. మానవ హక్కుల కమిషన్, సీఐడీ అధికారులు కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మృతుడు, అతని తండ్రిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచారు. విచారణలో తనకు దాహంగా ఉందని, నీరు కావాలని మృతుడు వేడుకున్నాడు. నీళ్లు తాగుతున్న సమయంలోనే పోలీసు కళ్లకప్పి సైనైడ్ మింగేశాడని పోలీసులు అంటున్నారు. వెంటనే పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలతో బయటపడలేదని ఉత్తర కన్నడ ఎస్పీ ఎన్ విష్ణువర్ధన్ తెలిపారు. అయితే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications