బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ATM: మంచి దొంగ, ఏటీఎంలో దేవుడికి పూజ చేసి అంతా మంచి జరగాలని వేడుకున్నాడు, క్లైమాక్స్ లో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/తుమకూరు: చేస్తున్న పనిలో అంతా మంచే జరిగాలని చాలా మంది ఆ దేవుడిని పూజిస్తుంటారు. బయటకు వెలుతున్న సమయంలో చాలా మంది మాకు మంచి జరగాలని, అనుకున్న పని పూర్తి చేసేలా ఆశీర్వధించాలని దేవుడిని వేడుకుంటారు. అయితే ఒక దొంగ అతను చేస్తున్న పని పూర్తికావాలని దేవుడిని ముక్కుంటున్న సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో అడ్డంగా బుక్కైపోయాడు.

బెంగళూరు నగరంలోని ఏటీఎంలో దొంగతనం చేస్తున్న యువకుడు నాకు అంతా మంచి చేయ్యాలి దేవుడా అని వేడుకొని డబ్బులు చోరీ చెయ్యడానికి యత్నించడంతో అతన్ని కామాక్షిపాళ్య పోలీసులు పట్టుకున్నారు. చాలా మంది వారివారి మతాలను బట్టి ఏదైనా పని మొదలు పెట్టే సమయంలో దేవుడిని ప్రార్థిస్తుంటారు. ప్రతిమతానికి చెందిన వాళ్లు ఏదో ఒక సమయంలో దేవుడిని వేడుకుంటారు.

climax: అక్కతో అక్రమ సంబంధం, బావమరిదిని బావ ఏం చేశాడంటే ?,రాజీకి పిలిచి ?, క్లైమాక్స్ లో ట్విస్ట్!climax: అక్కతో అక్రమ సంబంధం, బావమరిదిని బావ ఏం చేశాడంటే ?,రాజీకి పిలిచి ?, క్లైమాక్స్ లో ట్విస్ట్!

బార్ లో ఉద్యోగం

బార్ లో ఉద్యోగం

కర్ణాటకలోని తుమకూరుకు చెందిన కరిచితప్ప అలియాస్ కరియా అనే యువుడు బెంగళూరు చేరుకుని కామాక్షిపాళ్య సమీపంలోని రంగనాథపురలోని నవరత్న బార్‌లో సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు కరియా స్కెచ్ వేశాడు. బార్ లో సంపాధిస్తున్న డబ్బు ఖర్చులకు సరిపోవడం లేదని అనుకున్నాడు.

సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రాలు

సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రాలు

బెంగళూరులో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం సెంటర్లు ఎక్కడ ఉన్నాయి అంటూ కరియా వెతికాడు. రాత్రి బార్ లో పని చేస్తున్న కరియా పగటిపూట ఏటీఎం కేంద్రాలను టార్గెట్ చేసుకున్నాడు. ఈనెల 14వ తేదీన కామాక్షిపాళ్యలోని కావేరీపురలోని యాక్సిక్ బ్యాంక్ ఏటీఎం కేంద్రం మీద కన్నువేశాడు. ఎలాగైనా ఏటీఎంలో డబ్బులు చోరీ చెయ్యాలని అనుకున్నాడు.

నువ్వే ఆశీర్వధించు స్వామి

నువ్వే ఆశీర్వధించు స్వామి

కామాక్షిపాళ్యంలోని కావేరీపురలోని జయలక్ష్మి కాంప్లెక్స్‌లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు దొంగిలించేందుకు వెళ్లాడు. ఈసారి దొంగతనానికి పాల్పడే ముందు ఏటీఎం కేంద్రంలోని సీసీటీవీ కెమెరా వైపు చూసిన కరియా స్వామి నాకు అంతా మంచి జరిగేలా ఆశీర్వధించు అని పని మొదలుపెట్టాడు. అయితే ఏటీఎం కేంద్రంలో డబ్బులు చోరీ చెయ్యడం సాధ్యం కాకపోవడంతో మరోసారి ఏటీఎం యంత్రానికి దండం పెట్టిన కరియా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

డబ్బులు రాలేదు కాని పోలీసులు వచ్చారు

డబ్బులు రాలేదు కాని పోలీసులు వచ్చారు

బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు నిందితుడు కరియాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఏటీఎం కేంద్రంలో దేవుడికి దండం పెట్టి చోరీ చెయ్యడానికి ప్రయత్నించిన ఫోటోలు బయటకు రావడంతో వైరల్ అయ్యాయి. దొంగలకు కూడా సెంటిమెంట్లు ఉన్నాయని ప్రజలు అంటున్నారు.

English summary
A young man tried to steal money after worshiping God in an ATM center in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X