Balakrishna: తండ్రి బాటలో హీరో, తల్లి బాటలో సమాజసేవ, బాలయ్య రియల్ హీరో, శైలజ!
బెంగళూరు: నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయన పుట్టిన రోజు సందర్బంగా బెంగళూరులో సమాజసేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ఆయన పుట్టిన రోజు సందర్బంగా అనేక సమాజసేవా కార్యక్రమాలు నిర్వహించారు. తమ అభిమాన హీరో బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా అభిమానులు స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహించారు.
కరోనా వైరస్ మహమ్మారితో జాగ్రత్తగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పేదలకు శానిజైర్లు, మాస్కులు పంపించిపెట్టారు తండ్రి బాటలో హీరో అయిన బాలయ్య తల్లి అడుగుజాడల్లో సమాజసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని డాక్టర్ శైలజా అన్నారు..

బాలయ్య రక్తంలో ఆ పవర్ ఉంది: డాక్టర్ శైలజా
బాలకృష్ణ వీరాభిమాని బెంగళూరు బాలకృష్ణ ఆధ్వర్యంలో బెంగళూరులోని శైలజా ఐ ఆసుపత్రిలో బాలయ్య పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర శైలజా మాట్లాడుతూ తండ్రి అడుగుజాడల్లో సినిమా హీరో అయిన బాలయ్య తల్లి అడుగుజాడల్లో సమాజసేవ చేస్తున్నారని ఆమె అన్నారు.

తన తల్లి కష్టం ఎవ్వరికి రాకూడదని క్యాన్సర్ ఆసుపత్రి
తన తల్లికి వచ్చిన కష్టం మరెవ్వరికి రాకూడదనే ఉద్దేశంతో హీరో బాలకృష్ణ బసవతరాకం క్యాన్సర్ ఆసుపత్రి నెలకోల్పారని, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఎంతో మంది క్యాన్సర్ వ్యాధితో బాదపడుతున్న పేదలకు వైద్యం అందిస్తూ వారి ప్రాణాలు నిలబెడుతున్నారని, బాలయ్య పేదల జీవితాల్లో రియల్ హీరోగా నలిచిపోతున్నారని డాక్టర శైలజా అన్నారు.

అభిమానులు ప్రజాసేవ చెయ్యాలి
హీరో బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ప్రజాసేవ చేస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా తన సొంత నియోజకవర్గం ప్రజలను బాలయ్య ఆదుకుంటున్నారని, ఆయన అభిమానులు కూడా ప్రజాసేవ చెయ్యాలని డాక్టర్ శైలజా బాలయ్య ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా పేదలకు ఉచితంగా శానిటైజర్లు, మాస్కులు, పండ్లు పంపిపెట్టారు. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ నాయకుడు బెంగళూరు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.












Click it and Unblock the Notifications