బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bajrangdal: హర్షా హత్య, హంతకుల మీద ఉగ్రవాద చట్టం కేసులు, బెయిల్ రాదు, ఆస్తులు అటాచ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ శివమొగ్గ: హిజాబ్ వివాదం జరుగుతున్న సమయంలోనే భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా దారుణ హత్యకు గురి కావడంతో కర్ణాటకలోని శివమొగ్గ అట్టుడికిపోయింది. హత్యకు గురైన హర్షా గోసంరక్షణా సమితిలో చాలా చరుకుగా పాల్లొంటున్నాడని, గోవులను తరలిస్తున్న సమయంలో చాలా మందిని అడ్డుకుని పశువులను రక్షించాడని పోలీసు అధికారులు ఇప్పటికే చెప్పారు. శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షాను దారుణంగా హత్య చేసిన కొందరు నిందితులు బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో బెంగళూరు పారిపోయారు.

హత్యకు గురైన హర్షాకు, హత్య చేసిన నిందితుల్లోని ఒకరికి మూడు సంవత్సరాల క్రితం గొడవ జరిగిందని విచారణలో వెలుగు చూసింది. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ముగ్గురిని శివమొగ్గలో అరెస్టు చేశారు. మరో ఇద్దరు బెంగళూరులో పోలీసులకు చిక్కారు. ప్రత్యేక పోలీసు టీమ్ లు భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులోని నిందితులు వరుసగా అందరిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 10 మంది అరెస్టు అయ్యారు. హర్షా హత్య కేసులో అరెస్టు అయిన నిందితుల మీద ఉగ్రవాద చట్టం కింద కేసులు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Russian Ukraine War: ఉక్రెయిన్ మహిళలను రష్యా సైనికులు రేప్ చేస్తున్నారు. మంత్రి ఫైర్!Russian Ukraine War: ఉక్రెయిన్ మహిళలను రష్యా సైనికులు రేప్ చేస్తున్నారు. మంత్రి ఫైర్!

హిజాబ్ టైమ్ లోనే భజరంగ్ దళ్ కార్యకర్త హత్య

హిజాబ్ టైమ్ లోనే భజరంగ్ దళ్ కార్యకర్త హత్య

హిజాబ్ వివాదం జరుగుతున్న సమయంలోనే భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా దారుణ హత్యకు గురి కావడంతో కర్ణాటకలోని శివమొగ్గ అట్టుడికిపోయింది. హత్యకు గురైన హర్షా గోసంరక్షణా సమితిలో చాలా చరుకుగా పాల్లొంటున్నాడని, గోవులను తరలిస్తున్న సమయంలో చాలా మందిని అడ్డుకుని పశువులను రక్షించాడని పోలీసు అధికారులు ఇప్పటికే చెప్పారు.

 మూడు సంవత్సరాల క్రితమే

మూడు సంవత్సరాల క్రితమే

శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షాను దారుణంగా హత్య చేసిన కొందరు నిందితులు బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో బెంగళూరు పారిపోయారు. హత్యకు గురైన హర్షాకు, హత్య చేసిన నిందితుల్లోని ఒకరికి మూడు సంవత్సరాల క్రితం గొడవ జరిగిందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 హత్య కేసులో 10 మంది అరెస్టు

హత్య కేసులో 10 మంది అరెస్టు

భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ముగ్గురిని శివమొగ్గలో అరెస్టు చేశారు. మరో ఇద్దరు బెంగళూరులో పోలీసులకు చిక్కారు. ప్రత్యేక పోలీసు టీమ్ లు భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులోని నిందితులు వరుసగా అందరిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 10 మంది అరెస్టు అయ్యారు.

ఉగ్రవాద చట్టం దెబ్బతో ఫినిష్

ఉగ్రవాద చట్టం దెబ్బతో ఫినిష్

హర్షా హత్య కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితుల మీద ఉగ్రవాద చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. ఐపీసీ సెక్షన్ ల ప్రకారం ఉగ్రవాద చట్టం కింద కేసులు నమోదు అయితే బెయిల్ రావడం కూడా చాలా కష్టం అవుతోంది. ఇలాంటి కేసులను ఎన్ఐఏ అధికారులు కూడా విచారణ చేసే అవకాశం ఉంది, డిప్యూటీ పోలీసు కమీషనర్, ఏసీపీ స్థాయి అధికారులు స్వయంగా ఇలాంటి కేసులు విచారణ చేసి పూర్తి సమాచారం బయటకు లాగుతారు.

Recommended Video

Lok Sabha Election 2019 : నెల రోజుల్లో మోదీ మాజీ ప్రధాని : ఒవైసీ || Oneindia Telugu
 ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉంది

ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉంది

ఉగ్రవాద చట్టం కింద కేసులు నమోదు అయితే అలాంటి కేసుల్లో అరెస్టు అయిన వారి ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉంది. 2019లో యూఎపీఏ చట్టాన్ని పార్లమెంట్ అంగీకరించింది. చాలా మంది ఎంపీలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కొన్ని మార్పులు చేసి యూఏపీఏ చట్టాన్ని అమలు చేశారు. ఇలాంటి యూఎపీఏ చట్టం కింద హర్షా హత్య కేసులో నిందితుల మీద కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు నిందితులు బయటకు రావాలంటే చాలా కష్టం అని న్యాయనిపుణులు, పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Bajrangdal: Terrorism act case filed against Shivamogga Bajrangdal activist Harsha murder accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X