సీనియర్స్ పవర్ పంచ్, ఇప్పటికే ఎన్ని వేల మంది ఓట్లు వేశారంటే ?, బెంగళూరులో!

బెంగళూరు/బళ్లారి: కర్ణాటకలో పోలింగ్ కేంద్రాలలో క్యూలో నిలబడి ఓటు వెయ్యడానికి ఇబ్బంది పడుతున్న సీనియర్ సిటిజన్లు వారి ఇంటి నుంచి ఓటు వేసేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. దేశంలో మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇళ్లకే వెళ్లి సీనియర్ సిటిజన్ల దగ్గర ఓట్లు వేయించేలా కర్ణాటకలో సరికొత్త ప్రయోగం చెయ్యడంతో కొన్ని వేల మంది ఓట్లు వేశారు.

80 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న 99, 529 మంది సీనియర్ సిటిజన్లు వారి ఇళ్ల నుంచే ఓటు వేస్తామని ఎన్నికల అధికారుల దగ్గర వారి పేర్లు నమోదు చేయించుకున్నారు. శనివారం సీనియర్ సిటిజన్ల ఇళ్లకు వెళ్లి ఓటు వేయించుకునే ప్రక్రియ మొదలుపెట్టారు. మే 6వ తేదీ వరకు సీనియర్ సిటిజన్లు వారి ఓటు హక్కు వినియోగించడానికి అధికారులు అవకాశం ఇచ్చారు.

Bengaluru: 69132 senior citizens cast their votes in Karnataka assembly elections in three days

శనివారం, ఆదివారం బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 49, 797 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం 763 మంది ప్రత్యేక సిబ్బంది సీనియర్ సిటిజన్ల ఇళ్లకు వెళ్లి వారి దగ్గర ఓటు వేయించారు. సోమవారం 19, 335 మంది సీనియర్ సిటిజన్లు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మూడు రోజుల వ్యవదిలో 69, 132 మంది సీనియర్ సిటిజన్లు వారి ఓటు హక్కు వినిగియోగించుకున్నారని కర్ణాటక ఎన్నికల చీఫ్ మనోజ్ కుమార్ మీనా స్పస్టం చేశారు. మిగిలిన సీనియర్ సిటిజన్లతో ఓటు వేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా చెప్పారు.

సీనియర్ సిటిజన్లు, అంగవికలాంగులు వారి ఇంట్లోనే సీక్రేట్ ఓటు వెయ్యడానికి వారి పేర్లు నమోదు చేసుకున్నారు. బీబీఎంపీ అధికారులు సీనియర్ సిటిజన్ల ఇళ్లకు వెళ్లి వారితో ఓట్లు వేయిస్తున్నారు. అయితే బీబీఎంపీ అధికారులు వెళ్లకముందే బెంగళూరులో 33 మంది సీనియర్ సిటిజన్లు మరణించారని సంబంధిత ఎన్నికల అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+