మోజు తీరిపోయిందని దుబాయ్ ఎయిర్ హోస్ట్ ప్రియురాలిని చంపేసిన టెక్కీ, ఫస్ట్ డ్రామాలు!
బెంగళూరు/దుబాయ్: బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి పడి ఎయిర్‌హోస్టెస్ మృతి చెందిన కేసులో కోరమంగళ స్టేషన్ పోలీసులు ఆమె ప్రియుడు ఆదేశ్‌ను అరెస్టు చేశారు.హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అర్చనా ధీమాన్ అలియాస్ అర్చనా దుబాయ్‌లో నివాసం ఉంటూ అంతర్జాతీయ సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం చేస్తోంది.
మార్చి 6న ప్రియుడిని కలిసేందుకు దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చింది. మార్చి 10న అర్థరాత్రి కోరమంగళలోని అపార్ట్‌మెంట్‌లో ప్రియాకర్ ఆదేశ్ అలియాస్ ఆదేశ్, అర్చనా లిక్కర్ పార్టీ చేసుకున్నారు. ఇన్ని రోజులు అర్చనా ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకుంటే ఇప్పుడు కేసు ఊహించని మలుపు తిరిగింది.

పెళ్లి వియంలో అర్దరాత్రి చర్చలు
అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో నాలుగో అంతస్తు దగ్గర నిలబడిన అర్చనా, ఆదేశ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని అర్చనా పట్టుబట్టింది. త్వరలో మా ప్రేమ గురించి మీ తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకోమని ప్రియుడు ఆదేశ్ కు చెప్పింది. పెళ్లి చేసుకోవడం కుదరదని టెక్కీ ఆదేశ్ చెప్పాడు. మనం ఇలాగే స్నేహంగా ఉంటూ సహజీవనం చేద్దాం అని ఆదేశ్ అతని ప్రియురాలు అర్చనాకు చెప్పాడు.

ప్రియుడే చంపేశాడు
నువ్వు నాతో చాలాసార్లు శారీరక సంబంధం పెట్టుకున్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెబితే ఎలా అంటూ అర్చనా ఆమె ప్రియుడు ఆదేశ్ ను నిలదీసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోయి గొడవకు దారితీసింది. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న టెక్కీ ఆదేశ్ ఆగ్రహంతో అతని ప్రియురాలు అర్చనాను అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. దీంతో కిందపడిన అర్చనా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు అన్నారు.

డ్రామాలు ఆడిన ప్రియుడు
పోలీసుల విచారణ ప్రారంభంలో మద్యం మత్తులో తన ప్రియురాలు అర్చనా పై నుంచికిందకు పడి చనిపోయిందని కిటాడీ టెక్కీ ఆదేశ్ పోలీసులకు చెప్పాడు. ఆదేశ్ తమ కుమార్తె అర్చనాను హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అర్చనా ఆత్మహత్య కేసు హత్య కేసుగా నమోదు చేసి ఆదేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టాడని పోలీసులు అన్నారు, అర్చనాను హత్య చేసిన తరువాత ఆదేశ్ కేరళలోని కాసర్‌గోడ్ కు పారిపోవడంతో అక్కడే అతన్ని అరెస్టు చేసి బెంగళూరు నగరానికి తీసుకొచ్చి విచారణ చెయ్యడంతో మొత్తం మ్యాటర్ బయటకు వచ్చింది.

మోజు తీరిపోయిందని చంపేసిన టెక్కీ
ఒక సంవత్సరం క్రితం అర్చనా, టెక్కీ ఆదేశ్ డేటింగ్ యాప్‌లో కలుసుకున్నారు, తరువాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అర్చనా దుబాయ్‌లో పనిచేస్తుండడంతో ప్రియుడు ఆదేశ్‌ను కలవడానికి అప్పుడప్పుడు బెంగళూరు వచ్చేదని పోలీసులు అన్నారు, అర్చనాతో సహజీవనం చేసిన ఆదేశ్ ఆమె మీద మోజు తీరిపోయిన తరువాత ఆమెను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడని, పెళ్లికి ప్రతిసారీ ఏదో ఒక కథ చెప్పి తప్పించుకునేవాడని, చివరికి అపార్ట్ మెంట్ నుంచి ఆమెను తోసేసి హత్య చేశాడని బెంగళూరులోని కోరమంగల పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications