పిల్లల జీవితాలతో గేమ్స్, బూస్ట్, లేస్ లు, వామ్మో పెద్ద స్కామ్ రా నాయనా!
బెంగళూరు: బూస్ట్ గడువు ముగిసినా పిల్లల కోసం అంగడిలో విక్రయిస్తున్నారని, దిన సరుకులు, ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారనే ఆరోపణపై ఐటీ హబ్ బెంగళూరులోని సీసీబీ పోలీసులు ఓ దుకాణంపై దాడి చేసి ఆ షాప్ ఓనర్ ను అరెస్టు చేశారు. బెంగళూరులోని డీజే హళ్లికి చెందిన సిద్దిక్ పాషాను అరెస్టు చేసి నిందితుడి నుంచి రూ. 50 లక్షల విలువైన గడువు ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
కేజీ హళ్లిలోని శ్యాంపుర ప్రధాన రహదారిపై దుకాణం ఉన్న పాషాకు గడువు ముగిసిన ఆహార పదార్థాలను అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ పక్కా సమాచారం ఆధారంగా ఉమెన్స్ ప్రొటెక్షన్ స్క్వాడ్ అధికారులు పాషా షాపు మీద దాడులు చేశారని బెంగళూరు సీసీబీ అధికారులు తెలిపారు.

పాషా కొన్నాళ్లుగా శ్యామ్ పురా మెయిన్ రోడ్డులో షాపు నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్ కోటే సమీపంలోని గోదాములో గడువు ముగిసిన కిరాణా వస్తువులు, ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు, బేబీ ఫుడ్, న్యాప్‌కిన్లు, వంటనూనె, అందం పెంచే బ్యూటీ వస్తువులు, బిస్కెట్లు నిర్ణీత ధర కంటే 10% తక్కువకు కొనుగోలు చేసేవాడని పోలీసు అధికారులు అన్నారు.
తర్వాత వాటి వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా కూడా పాషా వాటిని అమ్మేశాడు.
ఫంగల్ ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్మేవాడు. తక్కువ ధరలపై వినియోగదారుడిని అడగ్గా గోదాము నుంచి సామాగ్రిని తెప్పించి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి మోసం చేసేవాడని పోలీసు అధికారులు తెలిపారు. దుకాణంలో అమ్మకానికి పాషా అక్రమంగా బాల కార్మికులను ఉపయోగించుకున్నాడని అధికారులు వివరించారు.
పాషా షాపులో చిన్నారులు, పిల్లల ఉత్పత్తులు కూడా కాలం చెల్లినవిగా గుర్తించారు. విచారణలో తాను కొన్ని హోటళ్లకు వీటిని సరఫరా చేశానని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఆ హోటళ్లలో స్వీట్ల తయారీకి కాలం చెల్లిన బేబీ ఫుడ్ వినియోగిస్తున్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి విచారణ నిర్వహించనున్నట్లు బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications