బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: డీజేహళ్లి కేసులో పీఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యూసఫ్ అరెస్టు, ఎన్ఐఏ దెబ్బతో అదే రోజు?!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/కోప్పళ: దేశవ్యాప్తంగా అప్పట్లో కలకలం రేపిన బెంగళూరు డీజేహళ్ళి, కేజీహళ్ళి అల్లర్ల కేసులో పీఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు వివిద రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో దాడులు చేస్తున్న సమయంలో బెంగళూరు డీజేహళ్ళి గొడవల కేసులో పీఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరులోని డీజేపీహళ్లిలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో నిందితులు ఆయన ఇంటి మీద పెట్రోల్ పోసి నిప్పంటించడం అప్పట్లో కలకలం రేపింది.

Paramour: మాయలేడి, నలుగురు భర్తలు, ఐదో ప్రియుడితో రొమాన్స్, క్లైమాక్స్ లో అడవిలో?Paramour: మాయలేడి, నలుగురు భర్తలు, ఐదో ప్రియుడితో రొమాన్స్, క్లైమాక్స్ లో అడవిలో?

బెంగళూరులో అల్లర్లు

బెంగళూరులో అల్లర్లు

2020 ఆగస్టు 13వ తేదీన బెంగళూరు నగరంలోని కేజీ హళ్ళి, డీజే హళ్లిలో అల్లర్లు జరిగాయి. అదే రోజు అర్దరాత్రి కొందరు నిందితులు స్థానిక ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి ఇంటి మీద దాడులు చేశారు. బెంగళూరులోని డీజేపీహళ్లిలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో నిందితులు ఆయన ఇంటి మీద పెట్రోల్ పోసి నిప్పంటించడం అప్పట్లో కలకలం రేపింది.

 ఎన్ఐఏ ఎంట్రీతో సీన్ రివర్స్

ఎన్ఐఏ ఎంట్రీతో సీన్ రివర్స్

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు వివిద రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో దాడులు చేస్తున్నారు. ఎస్ డీపీఐ, పీఎఫ్ఐ కార్యాలయాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల హత్యకు గురైన బీజేపీ నాయకుడు ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు గురువారం వేకువ జామున మంగళూరు సిటీలో సోదాలు చేస్తున్నారు.

 బెంగళూరులో సోదాలు

బెంగళూరులో సోదాలు

బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు బెంగళూరులో సోదాలు చేస్తున్నారు. బెంగళూరులోని రిచ్మండ్ టౌన్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సోదాలు చేసిన ఎన్ఐఏ అధికారులు వివిద పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఎన్ఐఏ అధికారులు ఆ అపార్ట్ మెంట్ లో నుంచి బయటకు వెళ్లిపోయినా అక్కడ మాత్రం స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పీఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరెస్టు

పీఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరెస్టు

బెంగళూరు డీజేహళ్ళి గొడవల కేసులో పీఎఫ్ఐ కోప్పళ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఫయాజ్ అలియాస్ మోహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరులోని డీజేపీహళ్లిలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో నిందితులు ఆయన ఇంటి మీద పెట్రోల్ పోసి నిప్పంటించడం అప్పట్లో కలకలం రేపింది.

ఎన్ఐఏకి సంబంధం లేదు

ఎన్ఐఏకి సంబంధం లేదు

పీఎఫ్ఐ కోప్పళ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఫయాజ్ అరెస్టుకు ఎన్ఐఏకి ఎలాంటి సంబంధం లేదని, బెంగళూరు పోలీసులు సమాచారం ఇవ్వడం వలనే అతన్ని అరెస్టు చేశామని కోప్పళకు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి స్థానిక మీడియాకు చెప్పారు. మొత్తం మీద మంగళూరు, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం వేకువ జామున నుంచి ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. .

English summary
Bengaluru DJ Halli and KG Hall riot case, PFI district president arrested at Koppal in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X