బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

DK: ట్రబుల్ షూటర్ కు మళ్లీ నోటీసులు ఇచ్చిన ఈడీ, నెల తరువాత సేమ్ డేట్ ఫిక్స్, ఏం చేస్తారో చూడాలి?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గత నెలలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన డీకే శివకుమార్ ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చెయ్యడంతో డీకే శివకుమార్ మరోసారి ఢిల్లీ వెళ్లడానికి సిద్దం కావాలసి వచ్చింది.

ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినా పదేపదే తనకు నోటీసులు జారీ చేస్తున్నారని డీకే. శివకుమార్ అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు. గత నెలలో డీకే శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు ఢిల్లీలోని కార్యాయానికి పిలిపించుకుని విచారణ చేసి వివరాలు సేకరించారు.

Famiy: అత్తను ఇంట్లో నుంచి తరిమేయాలని కోడలి స్కెచ్, కిలాడీ ఎంతకు తెగించిందంటే ?, రాడ్ తో!Famiy: అత్తను ఇంట్లో నుంచి తరిమేయాలని కోడలి స్కెచ్, కిలాడీ ఎంతకు తెగించిందంటే ?, రాడ్ తో!

టైమ్ కావాలని మనవి చేసిన డీకే

టైమ్ కావాలని మనవి చేసిన డీకే

నేషనల్ హెరాల్డ్ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు డీకే శివకుమార్ కు గత నెలలో నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సస్ చెయ్యాలని, అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ ఏ టూ ఝడ్ ఆయనే చూసుకుంటున్నారు. విచారణకు హాజరుకావాలని తనకు సమయం కావాలని డీకే శివకుమార్ చెప్పినా అందుకు ఈడీ అధికారులు అంగీకరించలేదు.

ఈడీ విచారణకు హాజరైన డీకే శివకుమార్

ఈడీ విచారణకు హాజరైన డీకే శివకుమార్

గత నెల 7వ తేదీన ఢిల్లీ చేరుకున్న డీకే. శికుమార్ ఏపీజే అబ్దుల్ కలామ్ రోడ్డులోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఢిల్లీ కార్యాలయానికి మమ్మల్ని విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇప్పించి బీజేపీ రాజకీయ కక్ష సాధింపులు సాగిస్తున్నారని డీకే శివకుమార్ ఆరోజు ఆరోపించారు.

ఇది బీజేపీ రాజకీయం

ఇది బీజేపీ రాజకీయం

మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాలంలో మా పార్టీ నాయకులు స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మీరు ఎందుకు నిధులు ఇచ్చారు, మీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఈడీ అధికారులు మమ్మల్ని ప్రశ్నించారని, కావాలనే తనను, తన కుటుంబ సభ్యులను వేధించాలని ఈడీని బీజేపీ పంపిస్తోందని ఆరోజు డీకే శివకుమార్ మండిపడ్డారు.

నెల రోజులకు మళ్లీ సేమ్ డేట్

నెల రోజులకు మళ్లీ సేమ్ డేట్

గత నెల 7వ తేదీన ఢిల్లీలో ఈడీ అధికారుల ముందు డీకే శివకుమార్ విచారణకు హాజరైనారు. ఇప్పుడు మళ్లీ ఇదే నెల 7వ తేదీ సోమవారం విచారణకు రావాలని డీకే శివకుమార్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చెయ్యడంతో డీకే శివకుమార్ మరోసారి ఢిల్లీ వెళ్లడానికి సిద్దం కావాలసి వచ్చింది.

ఏం చేస్తారో చూడాలి

ఏం చేస్తారో చూడాలి

ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినా పదేపదే తనకు నోటీసులు జారీ చేస్తున్నారని డీకే. శివకుమార్ అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు. అయితే సోమవారం డీకే శివకుమార్ ఢిల్లీ వెలుతారా ?, లేదా ? అనే విషయంలో ఇంత వరకు క్లారిటీ లేదని ఆయనకు సన్నిహితంగా ఉంటున్న ఓ నాయకుడు అంటున్నారని తెలిసింది.

English summary
Bengaluru: KPCC President D. K. Shivakumar again summoned by Enforcement Directorate in New Delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X