బెంగళూరు పరువు నీటిపాలు: మనిషికి రూ.150: ట్రాక్టర్లు, జేసీబీలకు భలే గిరాకీ..!!

బెంగళూరు: ఇటీవల కురిసిన అతి భారీ వర్షం దెబ్బ నుంచి సిలికాన్ సిటీ బెంగళూరు.. ఇంకా కోలుకోవట్లేదు. సోమవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలు, టెక్ పార్కులు ఇంకా వరద ముంపులోనే ప్రధాన మార్గాల్లో రెండు నుంచి మూడడుగుల మేర వర్షపునీరు నిలిచిపోయింది. స్కూటర్లు, కార్లు రోడ్లపై రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా చాలామంది ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లడానికి ట్రాక్టర్లను ఆశ్రయించారు.

మరిన్ని భారీ వర్షాలు..

రెండు రోజులుగా బెంగళూరులో అతి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. రికార్డుస్థాయి వర్షపాతం అది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో ఆరంభమైన వర్షం సోమవారం తెల్లవారు జాము వరకూ ఏకధాటిగా కురిసింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని ఈస్ట్, నార్త్, సౌత్ జోన్లల్లో వర్షం తీవ్రత అధికంగా కనిపించింది.

వరదపోటు..

సోమవారం రాత్రి కూడా మళ్లీ భారీ వర్షం కురిసింది. ఇప్పటికే వరదముంపులో ఉన్న బెంగళూరియన్లకు ఇది మరింత ఇబ్బందులను తెచ్చిపెట్టింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లడంతో మురుగునీరు రోడ్లపై పోటెత్తింది. యామలూరు, బెల్లందూరు, సర్జాపుర, వైట్‌ఫీల్డ్, బన్నేరుఘట్ట రోడ్, బసవేశ్వర నగర, యశ్వంతపూర్, పీణ్య, లగ్గెరె, విజయనగర, రాజాజీనగర, మల్లేశ్వరం, శేషాద్రిపురంలల్లో మళ్లీ వర్షం కురిసింది.

రూ.225 కోట్లు నష్టం..

రోడ్లపై వర్షపునీరు ఏ మాత్రం తగ్గకపోవడానికి తోడుగా మళ్లీ వర్షం కురవడంతో వాహనదారుల ఇక్కట్లు మరింత పెరిగాయి. వర్షం కారణంగా 225 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఐటీ కంపెనీల యజమానులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి. ఫ్లైఓవర్లు, మెట్రో లైన్లు నిర్మాణంలో ఉన్న రహదారుల్లో రాకపోకలు సాగించే వాహనదారులు నరకాన్ని చవి చూశారు. ఒకవైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్‌లో చిక్కుకునిపోవడంతో గంటల తరబడి ఎటూ కదల్లేని దుస్థితిని ఎదుర్కొన్నారు.

ట్రాక్టర్లపై..

ఈ పరిణామాల మధ్య చాలామంది ఉద్యోగులు ఇవ్వాళ ట్రాక్టర్లను ఆశ్రయించారు. మనిషి 100 నుంచి 150 రూపాయల వరకు చెల్లించి తమ కార్యాలయాలకు బయలుదేరి వెళ్లడం కనిపించింది. ఎలక్ట్రానిక్ సిటీ, బెల్లందూరు, మాన్యత టెక్ పార్క్ వంటి ప్రాంతాల్లో ట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో తిరుగాడాయి. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించడానికి కూడా ప్రయాణికులు ట్రాక్టర్లనే ఆశ్రయించారు. కొన్ని చోట్ల జేసీబీ బకెట్లలో నిల్చుని ప్రయాణం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+