బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరుకు షాక్-భారత్ లో అత్యల్ప నివాసయోగ్యత కలిగిన నగరం-గ్లోబల్ ర్యాంకుల్లో వెల్లడి

|
Google Oneindia TeluguNews

ది ఎకనామిస్ట్ వార్తాపత్రికను ప్రచురించే గ్లోబల్ మీడియా, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కంపెనీ ది ఎకనామిస్ట్ గ్రూప్ పరిశోధన , విశ్లేషణ విభాగం ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) గత వారం తన వార్షిక నివాసయోగ్యత సూచిక నివేదికను విడుదల చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలకు ర్యాంకులు ప్రకటించింది. ఒక నగరంలో వారి 'జీవన' భాగస్వామ్యం లేదా లభిస్తున్న జీవన ప్రమాణాలపై అధ్యయనం చేసి ఈ ర్యాంకులు వెల్లడించింది.

ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో గతేడాది మరో అధ్యయనంలో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్‌గా బెంగళూరు నిలిచింది. కానీ ప్రస్తుతం వెల్లడించిన ర్యాంకింగ్స్ లో భారతీయ నగరాల్లో అతి తక్కువ నివాసయోగ్యమైనదిగా బెంగళూరను పేర్కొంది.EIU గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2022లో ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో జీవన పరిస్థితులను విశ్లేషించింది. వీటిలో భారతదేశంలో న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలు ఉన్నాయి. మొత్తం ఐదు భారతీయ నగరాలు 140 నుంచి 146 మధ్య ర్యాంకుల్లో నిలిచాయి. అంటే అవి ఇండెక్స్‌లో అట్టడుగు స్థాయికి పడిపోయాయి.

bengaluru ranked least livable city in india in global index with its poor infra

భారతీయ నగరాల్లో, న్యూ ఢిల్లీ 56.5 నివాసయోగ్యత స్కోర్‌తో 140 అగ్ర ర్యాంక్‌ను అందుకుంది. దీని తర్వాత ముంబై 141 (స్కోరు 56.2), చెన్నై 142 (స్కోరు 55.8), అహ్మదాబాద్ 143 (స్కోరు 55.7), బెంగళూరు 146 (స్కోరు 54.4) వద్ద ఉన్నాయి. వీటిలో ఆదర్శ స్కోరు చూస్తే 100గా ఉంది. ఈ గ్లోబల్ ఇండెక్స్‌లో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌లను చేర్చడం ఇదే మొదటిసారి. మునుపటి నివేదికలలో భారతీయ నగరాల్లో ఢిల్లీ, ముంబై మాత్రమే ఉన్నాయి.

ఈసారి గ్లోబల్ సూచీల్లో వివిధ నగరాలు ఐదు విస్తృత అంశాల ఆధారంగా ర్యాంక్ చేశారు. స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాలు. స్థిరత్వం, సంస్కృతి, పర్యావరణానికి అత్యధిక వెయిటేజీ ఇచ్చారు. వీటిలో ఒక్కొక్కదానికీ 25 శాతం వెయిటేజ్ ఇచ్చారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు ఒక్కొక్కటి 20 శాతం వెయిటేజీని ఇచ్చాు. అలాగే విద్యకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.

English summary
bengaluru ranked last in livability cities list in The Economist Intelligence Unit's Global Livability Index 2022.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X