Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం మార్క్ రాజకీయం, రాగిముద్ద, ఆకుకూరలు, బ్రెడ్, జామ్ ఎంట్రీ, సబ్సిడీతో డీల్!

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆయన మార్క్ రాజకీయాలు మొదలుపెట్టారు. పేదల ఫైవ్ స్టార్ హోటల్ ఇందిరా క్యాంటిన్ లో కొత్త మెనూ తీసుకువస్తున్నారు. జామ్, మంగళూరు బన్స్‌తో కూడిన రెండు బ్రెడ్‌లు త్వరలో ఇందిరా క్యాంటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లో అందుబాటులో ఉంటాయి. మెనూలో రెండు అదనపు స్నాక్స్ జోడించబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇడ్లీ, పొంగల్, ఖరాబాత్, బిస్బేలేబాత్, వెజిటబుల్ పులావ్‌లకు అదనంగా ఇవి అందుబాటులో ఉంటాయి.

ఎంతో ఆర్భాటంగా ఇందిరా క్యాంటీన్లను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ వాటిని పునఃప్రారంభిస్తోంది. క్యాంటీన్‌లను పునరుద్ధరించడం, క్యాంటిన్లు విస్తరించడం మాత్రమే కాకుండా, వాటి మెనూలను కూడా పునరుద్ధరిస్తున్నారు. వచ్చేవారం జోనల్ స్థాయిలో ఇందిరా క్యాంటీన్లు నిర్వహించేందుకు, ఆహారాన్ని అందించేందుకు తాజాగా టెండర్లను ఆహ్వానించేందుకు నగర పౌరసరఫరాల సంస్థ సిద్ధమైంది.

Bengaluru: Siddaramaiah government changing Indira canteen menu in Karnataka

ఇందిరా క్యాంటీన్లలో మద్యాహ్నం, రాత్రి డిన్నర్ కోసం మెనూలో రాగి ముద్ద, ఆకుకూరల చారులు ప్రవేశపెడతారు. ఇది ప్రతి రోజు అందుబాటులో ఉంటుంది. ఇతర రోజులలో చపాతీ, సాగు లేదా చపాతీ వెజ్ గ్రేవీతో అన్నం మరియు కూరగాయల సాంబార్ అందుబాటులో ఉంటుంది. వారానికి ఐదు రోజులు మాత్రమే మధ్యాహ్న భోజనానికి తీపి పదార్థాలు కూడా పరిచయం చేస్తోంది.

ఉడకబెట్టిన గుడ్లు ఇవ్వాలనే ప్రతిపాదనపై కర్ణాటకలోని అధికార పార్టీ కాంగ్రెస్ లో చర్చ జరిగింది. అయితే ఇందిరా క్యాంటీన్ల పునరుద్ధరణపై ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో అలాంటి ప్రతిపాదనేమీ చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉడకబెట్టిన గుడ్లను అందించడం వల్ల ఖజానాకు విపరీతమైన ఖర్చవుతుందని, దాని వలన నష్టం వస్తుందని అధికారులు సీఎం సిద్దరామయ్యకు చెప్పారని తెలిసింది.

అటువంటి ప్రతిపాదన ఏదీ అధికారికంగా చర్చించలేదని ఓ అధికారి అన్నారు. అంతేకాకుండా ఇందిరా క్యాంటీన్ల భావన జీవనాధారమైన ఆహారాన్ని అందించడం, విలాసవంతమైన ఆహారం కాదు అని సీనియర్ అధికారి చెప్పారు. ప్రజలకు భోజనం ఖర్చు అల్పాహారం కోసం రూ. 5, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి ఒక్కొక్కరికి రూ. 10 ఇచ్చేవాళ్లమని బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ ఇటీవల చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ఖర్చు ఒక్కొక్కరికి రూ.25 అవుతుందని తెలిపారు.

Bengaluru: Siddaramaiah government changing Indira canteen menu in Karnataka

మేము రాత్రి భోజనానికి అందుబాటులో ఉన్న వస్తువుల సంఖ్యను మరియు వడ్డించే ఆహారాన్ని కూడా పెంచాలని నిర్ణయించుకున్నాము. బీబీఎంపీ ప్రజలకు చెల్లించే రూ. 25 రూపాయలకు రూ. 42 రూపాయల అదనపు సబ్సిడీని అందిస్తుందని, అయితే కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి మూడు పూటల మొత్తం ఖర్చు రూ. 67 రూపాయలుగా నిర్ణయించబడింది.

మొత్తం 175 నడుస్తున్న ఇందిరా క్యాంటీన్ల ఆర్థిక లోటుపాట్లన్నీ తీర్చి పునరుద్ధరిస్తాం అని బకాయిలు చెల్లించకపోవడంతో చాలా క్యాంటీన్లు కట్ అయ్యాయి. బెంగళూరు నగరంలో అదనపు క్యాంటీన్‌లను నిర్మిస్తున్నామని, మొత్తం సంఖ్య 250కి చేరుకుందని, బెంగళూరు నగరంలో ఒక వార్డుకు ఒక క్యాంటీన్‌ను ప్లాన్ చేశామని అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+