ఆస్కార్ అవార్డు, నాటు నాటు పాట రీమిక్స్, నాటు నాటు తీసేసి మోదీ మోదీ, అబ్బా ఏం తెలివి!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించి ఎవ్వరి మద్దతు తీసుకోకుండా మ్యాజిక్ ఫిగర్ తో అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న నాటు నాటు పాటలో నాటు నాటు అనే పదాలను తీసేసి మోదీ మోదీ అంటూ రీమిక్స్ చేసిన బీజేపీ నాయకులు ఆ పాటను వైరల్ చేస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రచారానికి అవసరమైన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. RRR సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. నాటు నాటు పాట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు అదే నాటు నాటు పాటలో నాటు నాటును తొలగించి ఆ పదాల స్థానంలో మోదీ మోదీ అంటూ పాటను రీమిక్స్ చేసి ఇద్దరు అబ్బాయిు, ఇద్దరు అమ్మాయిలో ఓ వీడియో చిత్రీకరించారు. RRRలోని నాటు నాటు పాటకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి స్టెప్పులు వేశారు అచ్చం అలాంటి స్టెప్పులతో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మోదీ మోదీ రీమిక్స్ పాటకు స్టెప్పులు ఇరగదీశారు.
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, కర్ణాటకలో గత మూడు ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసిన పనుల వివరాలను వివరిస్తూ నాటు నాటు పాట రీమిక్స్ మోదీ మోదీలో వివరిస్తూ ఓ పాట పాడించి ఆ పాటను రీమిక్స్ చేసి ప్రజల్లోకి వదిలేశారు. ఈ నాటు నాటు రీమిక్స్ పాటను కర్ణాటక మంత్రి డాక్టర్ సుధాకర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
కర్ణాటకలో గత మూడేళ్లలో శివమొగ్గ ఎయిర్ పోర్టు, బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభం, మెట్రో రైలు ప్రారంభం ఇలా కర్ణాటకలో పూర్తి చేసిన పలు పనుల వివరాలు. కేంద్రంలోని నరేంద్ర మోదీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రవేశపెట్టిన పలు పథకాల వివరాలతో నాటు నాటు రీమిక్స్ సాంగ్ ను చిత్రీకరించిన బీజేపీ నాయకులు వాటిని వైరల్ చేస్తున్నారు.
*"Modi Modi Modi"*
— jagdish sista (@JagdishSista1) April 12, 2023
This catchy song is based on the hit RRR song highlighting the achievements of the BJP government. pic.twitter.com/mH7QK94MC5
గతంలో 2009లో అస్కార్ అవార్డు సొంతం చేసుకున్న ఏఆర్. రెహమాన్ స్లమ్ డాగ్ సినిమాలోని జై హో పాటను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు జై హో కాంగ్రెస్ అంటూ రీమిక్స్ చేసి ఎన్నికల ప్రచారంలో లబ్ది పొందడానికి ప్రయత్నించారు. ఇప్పుడు అస్కార్ అవార్డు సొంతం చేసుకున్న నాటు నాటు పాటను మోదీ మోదీ అంటూ రీమిక్స్ చేశారు.
మోదీ మెదీ రీమిక్స్ పాటతో బీజేపీ నాయకులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ట్రిక్స్ తో బీజేపీ ఎంత వరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలని సామాన్య ప్రజలు అంటున్నారు. మొత్తం మీద తెలుగు ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఇప్పుడు కర్ఱాటకలో మోదీ మోదీ అంటూ దుమ్ములేపుతోంది.












Click it and Unblock the Notifications