Karnataka Elections 2023: కర్ణాటక బీజేపీ తొలి జాబితా.. ఎప్పుడంటే..!
మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఏప్రిల్ 11 లేదా 12న విడుదల చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.జాబితా ఖరారు విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. బహుశా మొదటి జాబితా రేపు లేదా ఎల్లుండి విడుదల చేస్తామన్నారు.
ఓ దశలో "ఈ సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉంది, అయితే మరిన్ని చర్చలు జరగాల్సి ఉన్నందున, మంగళవారం లేదా బుధవారం విడుదల చేయవచ్చు" అని శ్రీ బొమ్మై ఢిల్లీలో విలేకరులతో చెప్పారు. "కొంతమంది అభ్యర్థుల కోసం మరింత గ్రౌండ్ రిపోర్ట్ వివరాలు సేకరించాల్సి ఉంది. కొత్త అభ్యర్థులపై చర్చ జరగాలి" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అంతకు ముందు 170 నుంచి 180 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఈరోజు సాయంత్రంలోగా విడుదల చేస్తామని యడియూరప్ప చెప్పారు. "నిన్న అన్ని నియోజకవర్గాల గురించి చర్చలు జరిగాయి. ఈ రోజు మళ్లీ మా జాతీయ అధ్యక్షుడు J.P. నడ్డా మరికొన్ని వివరణల కోసం నన్ను పిలిచారు. నేను వాటిని వివరించాను. జాబితా ఈ సాయంత్రం లేదా రేపు రావొచ్చు" అని తెలిపారు. చర్చలు జరిగాయని జాబితా విడుదల చేయడంలో జాప్యం జరగదని కర్ణాటక బీజేపీ పేర్కొంది.
ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కానందుకు అసంతృప్తిగా ఉన్నారా అని యడ్యూరప్పను ప్రశ్నించగా.. అలాంటి ఏమి లేదన్నారు. "నేను ఏ సలహాలు ఇచ్చినా వారు అంగీకరించారు. మేము వెళ్తున్నాము.
సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం" అని యడియూరప్ప తెలిపారు. ఈసారి కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తెలుగు నేతలు కూడా సిద్ధమవుతున్నారు. ఉత్తర కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్, హోసూర్, కోలార్, బీదర్, గంగావతి, రాయచూర్, కొప్పోల్, గుల్బర్గా, వంటి చాలా ప్రాంతాల్లో తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు.












Click it and Unblock the Notifications