పవర్, రివర్స్ ఆపరేషన్ కు సిద్దం అయిన కాంగ్రెస్, జేడీఎస్, ఢిల్లీ నుంచి దౌడ్!

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయినా ఇంకా బీజేపీ-కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఇప్పటికే బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోందని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేక పవనాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలల్లో వెలుగు చూసింది. అధికారం మాదే అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ధీమాగా ఉన్న కంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు ఆపరేషన్ కమల దెబ్బతో ఆపార్టీ నాయకులు హడలిపోతున్నారు.

Congress party leaders who are ready to protect the MLAs, with Operation Congress

కర్ణాటకలోలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తరువాత ఆపరేషన్ కమలకు తెర లేస్తుందని తెలుసుకున్న కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాల గురువారం బెంగళూరు చేరుకున్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బెంగళూరు చేరుకున్న రణదీప్ సింగ్ సూర్జేవాల నేరుగా మాజీ సీఎం సిద్దరామయ్య ఇంటికి వెళ్లారు.

మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ తో రణదీప్ సింగ్ సూర్జేవాలా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తరువాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా రక్షించుకోవాలా అని ఆ పార్టీ నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరిపారని, పలు కోణాల్లో ఆలోచించారని తెలిసింది.

బీజేపీ-కాంగ్రెస్ పార్టీకి ఇంచుమించు దాదాపుగా ఒకే మెజారిటీ వస్తే ఆపరేషన్ కమల తెరమీదకు తెస్తారని ఇప్పటికే కర్ణాటకలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలా అయితే ఆపరేషన్ కాంగ్రెస్ కు మనం సిద్దం కావాలని ఆ పార్టీ నాయకులు డిసైడ్ అయ్యారని, బీజేపీకి అపరేషన్ కమలాకు చాన్స్ ఇవ్వకూడా చేస్తున్నారని తెలిసింది.

బెంగళూరు శివార్లలోని బిడిదిలోని ఓ రిసార్టులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పెట్టడానికి ఇప్పటికే డీకే శివకుమార్ సోదరుడు డీకే. సురేష్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. మరో వైపు జేడీఎస్ పార్టీకి చెందిన నాయకులను ఆపరేషన్ కమల బారినపడకుండా చూసుకోవడాని మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+