Bengaluru: ఐటీ హబ్ కు సవాల్, కరోనా ఎఫెక్ట్ తో హడల్, నెలలో ఐదింతలా ? ఖర్మరా బాబు!

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో కర్ణాటక ప్రజలు హడలిపోతున్నారు. కర్ణాటకలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 70 శాతం కేసులు ఐటీ హబ్, గ్రీన్ సిటీ బెంగళూరులోనే నమోదు కావడంతో ఆ నగరంలోని ప్రజలు హడలిపోతున్నారు. కొందరు మహానుభావులు ముఖానికి మాస్కులు కూడా వేసుకోకుండా బయట విచ్చలవిడిగా తిరగడం, బైక్ లో విపరీతంగా సంచరిస్తూ నానా హంగామా చేస్తుండటంతో ఎక్కడ కరోనా వైరస్ మాకు తగులుకుంటుందో అంటూ సామాన్య ప్రజలు కంటి మీద కునుకులేకుండా గడుపుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐటీ హబ్ బెంగళూరు నగర ప్రజలకు అనేక సవాళ్లు ఎదురౌతున్నాయి. నెల రోజుల వ్యవదిలో ఐదింతల కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో మా ఖర్మరా బాబు అంటూ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరిలో 6,813 కేసులు, ఇప్పుడు 50, 636 కేసులు

ఫిబ్రవరిలో 6,813 కేసులు, ఇప్పుడు 50, 636 కేసులు

బెంగళూరులో కరోనా వైరస్ మహమ్మారికి స్పీడ్ బ్రేక్ లు లేకుండా పోయింది. గత ఫిబ్రవరి నెలలో బెంగళూరులో 6, 813 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. మార్చి నెలలో 31, 886 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇప్పుడు ఏప్రిల్ 12వ తేదీకి మాత్రమే బెంగళూరు సిటీలో ఏకంగా 50, 636 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు.

 గోవిందా....... గోవిందా

గోవిందా....... గోవిందా

బెంగళూరులో 12 రోజుల్లో 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయని కర్ణాటక ఆరోగ్య శాఖ కమిషనర్ కేవి. త్రిలోక్ స్పష్టం చేశారు. బెంగళూరులో గత మంగళవారం కొత్తగా 5, 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరులో మంగళవారం రోజు 55 మంది కరోనా వైరస్ దెబ్బకు బలి అయ్యారు. బెంగళూరులో కరోనా రోగుల కోసం 3,750 పడకలు (బెడ్ లు) ఉన్నాయి.

 అయోమయంలో ప్రజలు

అయోమయంలో ప్రజలు

ఇప్పటికే బెంగళూరులో కరోనా రోగుల కోసం కేటాయించిన 70 శాతం పడకలు బర్తీ అయ్యాయి. బెంగళూరులోని కోవిడ్ సెంటర్లలో కొత్తగా మరో 6000 బెడ్ లు సిద్దం చేశామని బీబీఎంపీ అధికారులు అంటున్నారు. గత ఏడాది ఇదే సమయానికి బెంగళూరులో 11 వేల పడకలు సిద్దంగా ఉండేవని, ఇప్పుడు కరోనా రోగుల కోసం అంతకంటే ఎక్కువ పడకలు సిద్దం చేస్తున్నామని బీబీఎంపీకి చెందిన ఓ సీనియర్ అధికారి అంటున్నారు.

ఆ ఆసుపత్రుల్లో 50 శాతం రిజర్వ్

ఆ ఆసుపత్రుల్లో 50 శాతం రిజర్వ్

బెంగళూరు నగరంలో ప్రస్తుతం 4,000 మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగుల కోసం 50 శాతం పడకలు రిజర్వ్ చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, ఆ దిశగా మేము 50 శాతం పడకలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసన్నకుమార్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద బెంగళూరులో మరోసారి కరోనా వైరస్ పంజా విసరడంతో ప్రజలు హడలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+