Coronavirus: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్, మంత్రి శ్రీరాములు ఇంటికి!
బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిన వీఐపీల జాబితా రోజురోజుకు చాంతాడంత పెరిగిపోతుంది. ముఖ్యమంత్రులు, మంత్రులు, మాజీ సీఎంలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ లు, ఐపీఎస్, వైద్యులు ఇలా చెప్పకుంటూ పోతే చాలా మంది వీఐపీలు కరోనా బారినపడుతున్నారు. తాజాగా మైనింగ్ కింగ్, మాజీ మంత్రి, నాలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాధించుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. తనకు కరోనా లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిందని, వైద్యుల సలహామేరకు చికిత్స చేయించుకుంటున్నానని మాజీ మంత్రి స్పష్టం చేశారు.

మైనింగ్ కింగ్
కర్ణాటక రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి పేరు ప్రత్యేకంగా పరిచయం చెయ్యనవసరం లేదు. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలి జనార్దన్ రెడ్డికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో గాలి జనార్దన్ రెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజకీయాల్లోకి రాకముందే గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్
గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక మంత్రిగా పని చేశారు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన సోదరుగు గాలి కరుణాకర్ రెడ్డి మంత్రిగా పని చేశారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమేశేఖర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు, ఆయన వర్గీయులు ఎంతో మంది ఈ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ అంటే అందరూ టక్కున వారి పేర్లు చెప్పేస్తుంటారు.

కరోనా పాజిటివ్
గాలి జనార్దర్ రెడ్డి స్వల్ప అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి శనివారం రాత్రి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్దారించారు. తనకు కరోనా లక్షణాలు ఏమాత్రం లేవని, అయినా పాజిటివ్ అని వెలుగు చూసిందని, వైద్యుల సలహామేరకు తాను చికిత్స చేయించుకుంటున్నానని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న తన మిత్రులు, అభిమానులకు గాలి జనార్దన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రాణమిత్రుడి తల్లి మృతి
గాలి జనార్దన్ రెడ్డి ప్రాణమిత్రుడు, ఆయన కుటుంబంలో ఒక్కడిగా గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం బళ్లారిలో మంత్రి బళ్లారి శ్రీరాములు ఇంటిలో ఆయన తల్లి పుణ్యతిథి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తనకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటం వలన బళ్లారిలో మంత్రి బళ్లారి శ్రీరాములు ఇంటిలో జరుగుతున్న ఆయన తల్లి పుణ్యతిథి కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానని, ఇది తనను చాలా బాదిస్తోందని గాలి జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
Recommended Video

ఒకరు లేకుండా ఒకరు లేరు
గాలి జనార్దర్ రెడ్డి కుటుంబంలో, మంత్రి శ్రీరాములు కుటుంబంలో దాదాపుగా ఏ కార్యక్రమం జరిగినా ఇద్దరు పాల్గొనడం ఇంత వరకు ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా పాజిటివ్ కారణంగా తాను శ్రీరాములు తల్లి పుణ్యతిథి కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానని గాలి జనార్దర్ రెడ్డి ఆవేదన చెందుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. మేము ఒకరు లేకపోతే ఒకరు లేమని ఏన్నో సందర్బాల్లో గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications