బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Govt job: కరోనా పాజిటివ్, వీడి నోట్లో దుమ్ముపోయ్యా....ఎంతపని చేశాడో చూడు, ఆసుపత్రిలో?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ బళ్లారి/బాగల్ కోటే: కరోనా వైరస్ (COVID-19) పేరు చెబితే ప్రపంచ దేశాల్లో చిన్నాపెద్ద, శ్రీమంతులు, పేదలు అని తేడా లేకుండా హడలిపోతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన వెంటనే ప్రతిఒక్కరూ వారి ప్రాణాలు కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఓ కిలాడీగాడు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినా దర్జాగా తిరిగేసి అందర్ని కలిశాడు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మా అసిస్టెంట్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయిన తరువాత సాటి ఉద్యోగులను బెదిరించి రెండు రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను, సాటి ఉద్యోగులు, స్థానిక ప్రజలు కలిసి వారికి కరోనా వైరస్ వ్యాపించడానికి కారణ అయ్యాడని వెలుగు చూడటం ఆరోగ్య శాఖలో కలకలం రేపింది. వీడి నోట్లు దుమ్ము పోయ్యా...... ఎంతపని చేశాడు ?, మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడా ? అంటూ ఇప్పుడు అతన్ని కలిసిన వాళ్లు కరోనా వైద్యపరీక్షలు చేయించుకోవడానికి క్యూ కట్టారు.

Illegal affair: భర్త విదేశాల్లో, ఆంటీతో ఎంజాయ్, కూతురితో ?, బిగ్ షాట్ కొడుకు లీలలు!Illegal affair: భర్త విదేశాల్లో, ఆంటీతో ఎంజాయ్, కూతురితో ?, బిగ్ షాట్ కొడుకు లీలలు!

కర్ణాటకలో కరోనా భరతనాట్యం

కర్ణాటకలో కరోనా భరతనాట్యం

కర్ణాటకలో ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో కన్నడిగులతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు హడలిపోతున్నారు. ఐటీ హబ్ బెంగళూరులో దిక్కులేనన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దెబ్బకు గత మూడు రోజుల నుంచి కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే.

ప్రభుత్వ ఆసుపత్రిలో క్యూ

ప్రభుత్వ ఆసుపత్రిలో క్యూ

కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని ముధోళ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు కరోనా వైరస్ అనుమానిత రోగుగులు వైద్యపరీక్షలు చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. బాగల్ కోటే జిల్లాలో రోజురోజు కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో ఆ వైరస్ ను అరికట్టడానికి ఆరోగ్య శాఖ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

మూడు రోజుల మందు పాజిటివ్ రిపోర్టు

మూడు రోజుల మందు పాజిటివ్ రిపోర్టు

ముధోళ ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ముధోళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మా అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి మూడు రోజుల ముందే కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్దారించారు. నువ్వు విశ్రాంతి తీసుకోవాలని, ఆసుపత్రి వైపు రాకూడదని వైద్యులు, సీనియర్ అధికారులు ఆ ఫార్మా అసిస్టెంట్ కు సూచించారు.

వీడు ఏం చేశాడో తెలుసా ?

వీడు ఏం చేశాడో తెలుసా ?

కరోనా పాజిటివ్ అని తెలిసినా ఆ ఉద్యోగి ఏ మాత్రం పట్టించుకోలేదు. తనకు కరోనా పాజిటివ్ అని ఎవ్వరికీ చెప్పకూడదని అతను కిందిస్థాయి ఉద్యోగులను బెదిరించాడు. అనంతరం రోజూ ప్రభుత్వ ఆసుపత్రి రావడం, అక్కడకు వచ్చి వెలుతున్న స్థానిక ప్రజలను, రోగులను, వారి బంధువులను కలవడం, వారితో పిచ్చపాటిగా మాట్లాడం చేశాడు.

ఉద్యోగం గోవింద..... గోవిందా

ఉద్యోగం గోవింద..... గోవిందా

కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయిన తరువాత కూడా ఆ ఫార్మా అసిస్టెంట్ ఆసుపత్రికి వచ్చి వెలుతున్నాడని తెలుసుకున్న పై అధికారులు సీరియస్ అయ్యారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడని, కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం అయ్యాడని ఆరోపిస్తూ ఆ ఫార్మా అసిస్టెంట్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

వీడి నోట్లో దుమ్ము పోయ్యా...... ఎంతపని చేశాడు?

వీడి నోట్లో దుమ్ము పోయ్యా...... ఎంతపని చేశాడు?

రెండు రోజుల పాటు ఆ ఫార్మా అసిస్టెంట్ ను కలిసిన సాటి ఉద్యోగులు, స్థానిక ప్రజలు వీడి నోట్లు దుమ్ము పోయ్యా...... ఎంతపని చేశాడు ?, మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడా ? అంటూ ఇప్పుడు కరోనా వైద్యపరీక్షలు చేయించుకోవడానికి క్యూ కట్టారు. ప్రభుత్వం ఉద్యోగం, అది ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కరోనా పాజిటివ్ అని తెలిసినా రోగుల నుంచి లంచాలు తీసుకోవాడానికే ఇలా చేశాడని విమర్శలు గుప్పుమన్నాయి.

English summary
COVID-19: Karnataka government hospital employee suspended in Bagalkot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X