Owner: ఫైనాన్స్ కంపెనీ యజమాని దారుణ హత్య, ఫ్రెండ్ ఎస్కేప్, ఆఫీసులో ఏంజరిగిందంటే ?
బెంగళూరు/ఉడిపి: ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ యజమాని, ప్రముఖ వ్యాపారిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. ప్రతిరోజు ఫైనాన్స్ కంపెనీలో రాత్రి 10 గంటల వరకు లావాదేవీలు చూసుకుంటున్న వ్యక్తి తరువాత ఇంటికి వెలుతున్నాడు. రాత్రి 12 గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో వ్యాపారి కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు ఫైనాన్స్ కంపెనీ ఆఫీసు దగ్గరకు వెళ్లారు. ఫైనాన్స్ కంపెనీలోని సోఫాలో వ్యాపారి గొంతు కోసి అతి దారుణంగా హత్యకు గురి అయ్యాడని వెలుగు చూడటం కలకం రేపింది.

ఫేమస్ ఫైనాన్స్ కంపెనీ
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కుందాపుర తాలుకాలోని సళ్వాడిలో అజేంద్ర శెట్టి (33) అనేయువకుడు అతని స్నేహితుడు, సాటి వ్యాపారి అనూప్ తో కలిసి డ్రీమ్ ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. అజేంద్ర శెట్టి ఫైనాన్స్ వ్యవహారాలతో పాటు కొన్ని వ్యాపారాలు చేస్తున్నాడు. ఉడిపి జిల్లాలోని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీల్లో అజేంద్ర శెట్టి, అనూప్ నిర్వహిస్తున్న డ్రీమ్ ఫైనాన్స్ కంపెనీ కూడా ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

అనుమానం వచ్చింది
ప్రతిరోజు ఫైనాన్స్ కంపెనీలో రాత్రి 10 గంటల వరకు లావాదేవీలు చూసుకుంటున్న అజేంద్ర శెట్టి తరువాత ఇంటికి వెలుతున్నాడు. రాత్రి 12 గంటలు అయినా అజేంద్ర శెట్టి ఇంటికి రాకపోవడంతో వ్యాపారి కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అజేంద్ర శెట్టి ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు ఫైనాన్స్ కంపెనీ దగ్గరకు వెళ్లారు.

గొంతు కోసి చంపేసిన నిందితులు
డ్రీమ్ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలోని సోఫాలో అజేంద్ర శెట్టి శవమై కనిపించాడు. ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలోనే అజేంద్ర శెట్టి గొంతు కోసి దారుణంగా హత్య చేశారని గుర్తించిన అతని సోదరుడు మహేంద్ర శెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

వాడే హంతకుడు
అజేంద్ర శెట్టితో కలిసి ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్న పార్ట్నర్ అనూప్ తన సోదరుడు అజేంద్ర శెట్టిని హత్య చేసి ఉంటాడని అతని సోదరుడు మహేంద్ర శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోరెన్సిక్ నిపుణులు, వేలిముద్రల నిపుణులతో సంఘటనా స్థలంలో పరిశీలించి ఆధారాలు సేకరించామని పోలీసులు అన్నారు. వ్యాపారలావాదేవీలలో అవకతవలకు పాల్పడిన అనూప్ ను ప్రశ్నించినందుకే నా సోదరుడు అజేంద్ర శెట్టి హత్యకు గురైనాడని మహేంద్ర శెట్టి ఆరోపిస్తున్నాడు.

ఫ్రెండ్ అనూప్ ఎస్కేప్
అజేంద్ర శెట్టి హత్యకు గురైన తరువాత అతని వ్యాపార భాగస్వామి అనూప్ మాయం కావడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కుందాపుర పోలీసులు అంటున్నారు. అజేంద్ర శెట్టి హత్యకు ఆర్థిక లావాదేవీలు కారాణమా, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ నిర్వహకుడు, వ్యాపారి అజేంద్ర శెట్టి హత్యకు గురి కావడంతో ఉడిపి జిల్లాలో కలకలం రేపింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications