డీకే శివకుమార్‌కు మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు: ఈ టైంలోనా అంటూ డీకే ఫైర్
బెంగళూరు: మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.ప్రస్తుతం రాష్ట్రంలో రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' రాక కోసం ఏర్పాట్లలో బిజీగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. ఈడీ సమన్ల సమయాన్ని ప్రశ్నించారు.
"భారత్ జోడో యాత్ర, కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల మధ్యలో, వారు మళ్లీ ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా నాకు సమన్లు జారీ చేశారు. నేను విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే ఈ సమన్ల సమయం.. నా రాజ్యాంగ, రాజకీయ విధులను నిర్వర్తించడానికి అడ్డంకిగా మారింది' అని మైసూర్‌లో ఉన్న శివకుమార్ గురువారం ట్వీట్ చేశారు.

కాగా, కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో కూడా శివకుమార్ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో, ఈడీ నమోదు చేసిన 2018 మనీలాండరింగ్ కేసుకు సంబంధించి శివకుమార్, ఇతర నిందితులకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
In the midst of the #BharatJodoYatra and the assembly session, they have again issued me an ED summon to appear.
— DK Shivakumar (@DKShivakumar) September 15, 2022
I am ready to cooperate but the timing of this summon and the harassment I am put through, is coming in the way of discharging my constitutional and political duties.
కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో మంత్రిగా ఉన్న శివకుమార్ బెంగళూరు నుంచి ఢిల్లీకి భారీ మొత్తంలో అక్రమ, లెక్కలు చూపని నగదును సంపాదించారని, పన్ను ఎగవేత కోసం ఇతర సహ నిందితులతో కలిసి నేరపూరిత కుట్ర పన్నారని ఆర్థిక దర్యాప్తు సంస్థ తెలిపింది.
ఆదాయపు పన్ను శాఖ 2017 ఆగస్టు 2వ తేదీన ఢిల్లీలోని నిందితులకు చెందిన పలు ఆస్తులపై సోదాలు నిర్వహించి, లెక్కల్లో చూపని రూ.8,59,69,100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications