ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ భస్మీపటలం: రిసెప్షనిస్ట్ సజీవ దహనం
Electric bike showroom in Bengaluru: సిలికాన్ సిటీ బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ యువతి దుర్మరణం పాలైంది. మంటల బారిన పడి సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
బెంగళూరు రాజాజీనగరలో ఈ సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి డాక్టర్ రాజ్‌కుమార్ రోడ్ నవరంగ్ జంక్షన్ వద్ద గల మై ఈవీ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించాయి. బైక్‌లన్నీ కూడా మాడి మసి అయ్యాయి. అక్కడున్న ఫర్నిచర్ సహా ఏమీ మిగల్లేదు.

ఆ సమయంలో షోరూమ్‌లో ఉన్న 20 సంవత్సరాల యువతి మంటల బారిన పడి సజీవదహనం అయ్యరు. మృతురాలిని ప్రియగా గుర్తించారు. మై ఈవీ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో ఆమె రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోన్నట్లు సిబ్బంది తెలిపారు. బైక్ బ్యాటరీల్లో షార్ట్ సర్క్యుట్ సంభవించడం వల్ల మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో షోరూమ్‌లో ఎనిమిదిమంది వరకు ఉన్నారని తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే వాళ్లందరూ కూడా బయటికి రాగలిగారు. రిసెప్షనిస్ట్ ప్రియను బయటపడలేకపోయారు. ఆమెను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నించామని, మంటలు అంతకంతకూ వ్యాప్తి చెందడంతో సాధ్యపడలేదని ప్రవీణ్ అనే యువకుడు తెలిపాడు.
#Bengaluru #DrRajkumarRoad
— Manoj Ram (@_ManojRam) November 19, 2024
Electric Vehicle Showroom on Fire in Rajajinagar
Full Building has been caught on fire pic.twitter.com/BbQWd7T665
ప్రమాదం సంభవించిన సమయంలో 20 నుంచి 25 వరకు ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అవన్నీ కూడా మంటల బారిన పడ్డాయి. అందులో కొన్ని పేలిపోయాయి. దీని ధాటికి నిప్పురవ్వలు రోడ్డు మీదికి ఎగిసిపడ్డాయి. మెజిస్టిక్‌లోని కెంపేగౌడ బస్‌స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు ఇదే కావడం వల్ల భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
"ಸಂಚಾರ ಸಲಹೆ"
— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) November 19, 2024
ರಾಜ್ ಕುಮಾರ್ ರಸ್ತೆ, ನವರಂಗ್ ಬಾರ್ ಜಂಕ್ಷನ್ ಬಳಿ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ವೆಹಿಕಲ್ ಶೋರೂಮ್ ಗೆ ಬೆಂಕಿ ಹತ್ತಿದ್ದು, ಮೆಜೆಸ್ಟಿಕ್ ಯಿಂದ ಹೊರಹೋಗುವ ಮತ್ತು ಒಳಬರುವ ವಾಹನ ಸಂಚಾರವು ನಿದಾನಗತಿಯಲ್ಲಿರುತ್ತದೆ, ದಯಮಾಡಿ ಸಹಕರಿಸಿ. pic.twitter.com/F56enNcNnf
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. మంటలను ఆర్పివేశారు. మంటలను అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications