businessman: వ్యాపారి ఆత్మహత్య కేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు, సీఎం క్లారిటీ, అంత అర్జెంట్ ఎందుకు?

బెంగళూరు/రామనగర: ప్రముఖ వ్యాపారి కారులోనే రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యాపారి ఇంటిలో ఓ డెత్ నోట్, కారులో ఓడెత్ నోట్ రాసిపెట్టారు. తన ఆత్మహత్యకు ఆరు మంది అని రెండు డెత్ నోట్ లలో ఆ వ్యాపారి పేర్లు, వివరాలు రాశాడు.

డెత్ నోట్ లో మాజీ మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే పేరుతో పాటు అందరూ వ్యాపారుల పేర్లు ఉండటం కలకలం రేపింది. మా పార్టీ ఎమ్మెల్యే మీద కేసు నమోదు అయ్యింది, కేసు విచారణ జరుగుతోంది, తరువాత మాట్లాడుదాం అని స్వయంగా సీఎం మీడియాకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే

బెంగళూరు వ్యాపారి ప్రదీప్ రామనగర సమీపంలోని కగ్గలిపురంలో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసులో బెంగళూరులోని మహదేవుర బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అరవింద్ లింబావళితో సహ మొత్తం 6 మంది వ్యక్తుల మీద కగ్గలిపురం పోలీస్ స్టేషన్ ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది.

బెంగళూరు వ్యాపారి ప్రదీప్‌ ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే అరవింద లింబావళికి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చెయ్యడంతో పెద్దపెద్ద నాయకులు ఆ పోలీస్ స్టేషన్ పోలీసులపై ఒత్తిడి చేసి బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబాలి పేరు తీసేయాలని ఒత్తిడి చేస్తున్నారని కన్నడ మీడియా అంటోంది.

విచారణకు హాజరుకావాలని నోటీసులు?

విచారణకు హాజరుకావాలని నోటీసులు?

విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆఱు మందికి నోటీసులు ఇచ్చారని తెలిసింది. బెంగళూరు వ్యాపారి ప్రదీప్ ఆత్మహత్య కేసులో కర్నాటక మాజీ మంత్రి అరవింద్ లింబావళి కష్టాలు ఎదురు అవుతున్నాయని తెలిసింది.

వ్యాపారి ప్రదీప్ ఆత్మహత్య చేసుకునే ముందు అతను రాసిన డెత్ నోట్ కారణంగా వచ్చే శాసన సభ ఎన్నికల్లో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ లింబావళి విజయవకాశాల మీద దెబ్బ పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి ప్రదీప్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు

ఎమ్మెల్యే మీద అంత అర్జెంట్ గా ఎఫ్ఐఆర్ ఎందుకు?

ఎమ్మెల్యే మీద అంత అర్జెంట్ గా ఎఫ్ఐఆర్ ఎందుకు?

కగ్గలిపురంలో వ్యాపారి ప్రదీప్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మ హత్య చేసుకున్న కేసులో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అరవింద లింబావళి పేరు కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు రామనగర పోలీసులు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావళి పేరు ఎఫ్ ఐ ఆర్ లో అంత అర్జెంట్ గా ఎందుకు చేశారని, ఆ పేరు తొలగించాలని పలువురు రాజకీయ నాయకులుతో పాటు సీనియర్ అధికారులు కలిసి రామనగర పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారని ప్రముఖ కన్నడ టీవీ చానల్ న్యూస్ ప్రసారం చేసింది.

అరవింద్ లింబావళి పేరు ఎఫ్ ఐ ఆర్ ఎందుకు అంత అర్జెంట్ గా నమెదు చేశారు అంత అవసరమా అని కగ్గలిపురం పోలీసులను ప్రశ్నించారని తెలిసింది.

అధికార పార్టీ ఎమ్మెల్యే ఏ-3

అధికార పార్టీ ఎమ్మెల్యే ఏ-3

బెంగళూరు వ్యాపారి ప్రదీప్ ఆత్మహత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరవింద లింబావళి ఎ-3 నిందితుడిగా ఉన్నారు. ఇష్టం వచ్చిన అర్జెంట్ గా ఎఫ్ ఐ నమోదు చేయ్యడం ఏమిటి, అందులో అధికార పార్టీ ఎమ్మెల్యే అరవింద్ లింబాలి పేరు ఎందుకు చేర్చారు అని పలువురు రాజకీయ నాయకులు పోలీసులను ప్రశ్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రదీప్, నేను 5వ తరగతి నుండి ఇద్దరు కలిసి చదివామని, స్టార్ట్ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసామని, తర్వాత అనేక రకాల వ్యాపారాలు చెయ్యాలని సిద్దం అయ్యామని, కొన్ని సంవత్సరాల క్రితం ఓపోస్ అనే పబ్ తెరిచి అందులో దాదాపు రూ. 90 లక్షల డబ్బు పెట్టుబడి పెట్టామని, కానీ మాకు నష్టం వచ్చిందని ప్రదీప్ స్నేహితుడు కుమార్ సోమవారం మీడియాకు చెప్పారు. భారీ మొత్తంలో నష్టం వచ్చినా ప్రదీప్ పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియదు అని ప్రదీప్ స్నేహితుడు కుమార్ అంటున్నారు.

సీఎం బోమ్మయ్ క్లారిటీ

సీఎం బోమ్మయ్ క్లారిటీ

బెంగళూరు వ్యాపారి ప్రదీప్ ఆత్మహత్య గురించి మాట్లాడిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మాజీ మంత్రి, మాపార్టీ ఎమ్మెల్యే అరవింద్ లింబావళి మీద ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ముందు ఏమి జరగాలో అది మొత్తం చట్టపరంగా జరుగుతోందని, మేము నిందితులను కాపాడటానికి ప్రయత్నించడం లేదని సీఎం బసవరాజ్ బోమ్మయ్ క్లారిటీ ఇచ్చారు.

ఫ్యామిలీతో వెళ్లి ఎంతపని చేశాడు?

ఫ్యామిలీతో వెళ్లి ఎంతపని చేశాడు?

బెంగళూరులోని హెచ్ఎస్ ఆర్ లేఔట్ లోన నివాసం ఉంటున్న ప్రదీప్ అతని కుటుంబ సభ్యులతో కలిసి రామనగర తాలూకాలోని నెట్టిగెరె గ్రామంలోని రిసార్ట్ కు వెళ్లాడు. తరువాత కారులో కుర్చుకుని ఆత్మహత్య చేసుకునే ముందు వ్యాపారి ప్రదీప్ నా ఆత్మహత్యకు కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మంత్రి అరవింద లింబావళి, వ్యాపారులు, జయరామిరెడ్డి, రమేష్ రెడ్డి, సోమయ్య, గోపి, రాఘవ భట్ అనే వ్యక్తుల పేర్లు డెత్ నోట్ లో రాయడం ఇప్పుడు కలకలం రేపింది.

పార్టీ అయిన తరువాత ఏం జరిగింది

పార్టీ అయిన తరువాత ఏం జరిగింది

ఫ్యామిలీతో కగ్గలిపురం వెళ్లిన ప్రదీప్ అతని కుటుంబ సభ్యులు రిసార్ట్ లో ఉన్న సమయంలో అతను మళ్లీ బెంగళూరు వచ్చి ఇంట్లో ఓ డెత్ నోట్ రాసిపెట్టాడు. తరువాత కగ్గలిపురం చేరుకున్న ప్రదీప్ కారులో మరో డెత్ నోట్ రాసి రివాల్వర్ తో తలకు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అన్నారు.

హెచ్ఎస్ఆర్ లేఔట్ లో హోటల్ ప్రారంభించే వియంలో వ్యాపారులు తన దగ్గర కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని మోసం చేశారని, తనకు ప్రతినెల 1 లక్ష రూపాయలు ఇవ్వలని బీజేపీ ఎమ్యెల్యే అరవింద్ లింబాలి రాజీ చేశారని, తకు మొత్తం రివర్స్ అయ్యిందని ప్రదీప్ డెత్ నోట్ లో రాశాడని కగ్గలీపురం పోలీసులు తెలిారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+