Family: ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య, కూతురి పరిస్థితి ?, 9 నెలల పాప విషయంలో పోలీసులు!
కోలారు/ బెంగళూరు: చిన్నారి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ కుటుంబంలోని నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కుటుంబం పరువు పోతుందని ఆవేదనతో ఒకే కుటుంబంలోని ఐదు మంది విషం సేవించారు. విషం తాగిన కుటుంబ సభ్యులు బాధ తట్టుకోలేక ఆర్తనాదాలు చేశారు. స్థానికులు విషయం గుర్తించి ఐదు మందిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తెలిసిన మహిళ ఈ కుటుంబ సభ్యులకు ఆమె కూతురు (చిన్నారి) ఇచ్చింది. అమ్మాయిని పెంచి పోషించలేని తల్లి వీరికి బిడ్డను ఇచ్చింది.
అయితే తమ చేతికి వచ్చిన ఆడ బిడ్డను వేరే మహిళకు ఈ కుటుంబ సభ్యులు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కుటుంబ సభ్యులు నిజంగా ఆ బిడ్డను విక్రయించారా ?, లేదా ? అనే విషయం ఇంకా తేలకముందే పోలీసుల వేధింపులతో వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

కోలారు సమీపంలో దంపతులు
కర్ణాటకలోని కోలారు పట్టణం (ఆంధ్రా సరిహద్దు జిల్లా) సమీపంలోని హోన్నేనహళ్ళిలో సత్య, సుమిత్ర అనే మహిళ నివాసం ఉంటున్నారు. సత్య, సుమిత్ర దంపతులకు 9 నెలల కూతురు ఉంది. సత్యకు కోలారులోని గల్ పేట్ లోని కారంజికట్టలో నివాసం ఉంటున్న పుష్పా (38) అనే మహిళ పరిచయం ఉంది.

పుష్పా ఫ్యామిలీ
కోలారులోని కారంజికట్టలో పుష్పా తల్లిదండ్రులు మునేశప్ప (70), నారాయణమ్మ (65) నివాసం ఉంటున్నారు. పుష్పా భర్త బాబు (45), కుమార్తె గంగోత్రి (17) కూడా మునేశప్ప, నారాయణమ్మ దంపతులతో పాటు నివాసం ఉంటున్నారు. సుమిత్ర దగ్గర 9 నెలల పాపను తీసుకు వెళ్లిన తరువాత పుష్పా కొన్ని రోజులు వారి దగ్గరే పెట్టుకుందని తెలిసింది.

పాపను విక్రయించారా?
సుమిత్ర ఇచ్చిన 9 నెలల పాపను కొన్ని రోజులు తన దగ్గరే పెట్టుకున్న పుష్పా తరువాత వేరే దంపతులకు ఆ అమ్మాయిని విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల తరువాత సుమిత్రాకు విషయం తెలిసిం పుష్పా దగ్గరకు వెళ్లింది. నా బిడ్డ ఎక్కడుంది ? అని సుమిత్రా ప్రశ్నించింది. పుష్పా నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇద్దరి మద్య గొడవ జరిగింది.

కిడ్నాప్ కేసు నమోదు
కూతురి ఆచూకి చెప్పకోవడంతో రగిలిపోయిన సుమిత్రా వెంటనే కోలారు మహిళా పోలీస్ స్టేషన్ లో పుష్పా మీద బాలికను కిడ్నాప్ చేశారని కేసు పెట్టింది. పోలీసులు పుష్పాను, ఆమె భర్త బాబు, తల్లిదండ్రులు మునేశప్ప, నారాయణమ్మను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేశారు. నాలుగు రోజులు బిడ్డను అప్పగించకపోతే మీమీద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారని తెలిసింది.

పరువు పోతుందని భయపడి ఆత్మహత్య
పోలీసులు పిలిపించి వార్నింగ్ ఇచ్చి కేసులు నమోదు చేస్తామని బెదిరించడంతో పుష్పా కుటుంబ సభ్యులు భయపడిపోయారు. కుటుంబం పరువు పోతుందని ఆవేదనతో నారాయణమ్మ, మునేశప్ప, పుష్పా, ఆమె భర్త బాబు, కూతురు గంగోత్రి ఐదు మంది విషం సేవించారు. విషం తాగిన కుటుంబ సభ్యులు బాధ తట్టుకోలేక ఆర్తనాదాలు చేశారు.
స్థానికులు విషయం గుర్తించి ఐదు మందిని కోలారులోని ఆర్ ఎల్ జాలప్ప ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సోమవారం రాత్రి నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
Recommended Video

ఏదీ తేలకముందే ఒకే ఫ్యామిలీలో నలుగురి ఆత్మహత్య
9 నెలల అమ్మాయిని పెంచి పోషించలేని సావిత్రి పరిచయం ఉన్న పుష్పాకు బిడ్డను ఇచ్చింది. అయితే తమ చేతికి వచ్చిన ఆడ బిడ్డను పుష్పా ఆమెకు పరిచయం ఉన్న గీతా అనే మహిళకు ఈ కుటుంబ సభ్యులు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కుటుంబ సభ్యులు నిజంగా ఆ బిడ్డను విక్రయించారా ?, లేదా ? అనే విషయం ఇంకా తేలకముందే పోలీసుల వేధింపులతో ఒకే కుటుంబంలో నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పుష్పా పరిస్థితి కూడా విషమంగానే ఉందని, ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నదని వైద్యులు అంటున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications