బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Family: రెండో భార్య మోజులో కానీస్టేబుల్, మొదటి భార్య కొడుకు, కూతురు ఏం చేశారంటే ?, ఏదో అనుకుంటే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హుబ్బళి: కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కొన్ని ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాపురం చేసిన దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో ఆ పోలీసు రెండో పెళ్లి చేసుకున్నాడు. పోలీసును పెళ్లి చేసుకున్న తరువాత అతని రెండో భార్య భర్త మొదటి భార్య పిల్లలను కొంతకాలం బాగా చూసుకుంది. రానురాను ఆమె సవతి తల్లి ప్రేమ చూపించడం మొదలుపెట్టింది.

చాలాకాలం పిల్లలు మా పిన్ని మమ్మల్ని సక్రమంగా చూసుకోవడం లేదని పోలీసు తండ్రికి చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల గురించి పట్టించుకుంటే రెండో భార్య నన్ను పట్టించుకోదని అనుకున్న కానీస్టేబుల్ నిర్లక్షంగా ఉండిపోయాడు. పిన్ని టార్చర్ పెడుతున్నా కన్నతండ్రి మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆయన కొడుకు, కూతురు రగిలిపోయారు. పన్ని మీద కోపంతో పోలీసును అతని కన్న బిడ్డలు హత్య చేసి చేతులు దులుపుకోవడం కలకలం రేపింది.

Tweet: ఠాక్రే కోసం దియా మీర్జా ట్వీట్, గ్రహం అంటే బాలీవుడ్ గ్రహమా ?, వివేక్ కౌంటర్, కంగనా!Tweet: ఠాక్రే కోసం దియా మీర్జా ట్వీట్, గ్రహం అంటే బాలీవుడ్ గ్రహమా ?, వివేక్ కౌంటర్, కంగనా!

పోలీసు ఫ్యామిలీ

పోలీసు ఫ్యామిలీ

కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని కణవి గ్రామంలో ఇస్లాయిల్ సాబ్ (54) నివాసం ఉండేవాడు. 27 సంవత్సరాల క్రితం కేఎస్ఆర్ పీలో ఇస్మాయిల్ కు కానీస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. వివాహం చేసుకున్న ఇస్మాయిల్ అతని భార్యతో కలిసి హుబ్బళి చేరుకున్నారు. హుబ్బళి నగరంలోని ఏపీఎంసీ ఏరియాలో ఇస్మాయిల్ సాబ్ అలియాస్ పోలీసు ఇస్మాయిల్ కు ఫక్రూసాబ్ అనే కుమారుడు, దావలమున్నీ అనే కుమార్తె ఉన్నారు.

రెండో పెళ్లి చేసుకున్న పోలీసు

రెండో పెళ్లి చేసుకున్న పోలీసు

అనారోగ్యంతో భార్య చనిపోవడంతో పోలీసు ఇస్మాయిల్ సాబ్ కొన్ని సంవత్సరాల క్రితం కతునబీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. పోలీసు ఇస్లాయిల్ సాబ్ ను పెళ్లి చేసుకున్న తరువాత అతని రెండో భార్య కతునబీ ఆమె భర్త మొదటి భార్య పిల్లలు ఫక్రూసాబ్, దావలమున్నీ కొంతకాలం బాగా చూసుకుంది.

పిల్లల గురించి పట్టించుకుంటే?

పిల్లల గురించి పట్టించుకుంటే?

రానురాను కతునబీ ఆమె భర్త ఇస్మాయిల్ సాబ్ పిల్లల మీద సవతి తల్లి ప్రేమ చూపించడం మొదలుపెట్టింది. మా పిన్ని కతునబీ మమ్మల్ని సక్రమంగా చూసుకోవడం లేదని పోలీసు తండ్రి ఇస్తాయిల్ సాబ్ కు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల గురించి పట్టించుకుంటే నా రెండో భార్య కతునబీ నన్ను పట్టించుకోదని అనుకున్న కానీస్టేబుల్ ఇస్తాయిల్ సాబ్ నిర్లక్షంగా ఉండిపోయాడు.

కన్నతండ్రిని నమ్మించి చంపేసిన కొడుకు, కూతురు

కన్నతండ్రిని నమ్మించి చంపేసిన కొడుకు, కూతురు

భార్య మోజులో పడిన మాతండ్రి ఇస్తాయిల్ సాబ్ మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని అతని కొడుకు ఫక్రూసాబ్, కూతురు దావలమున్నీ రగిలిపోయారు. ఇస్తాయిల్ సాబ్ ను నమ్మించిన ఫక్రూసాబ్, కూతురు దావలమున్నీ ఆటో పిలుచుకుని వెళ్లి స్నేహితులు కాలేఖాన్, శివకుమార్, ఈశ్వర్ మొంటూరు రోహాన్ అనే నలుగురితో కలిసి హుబ్బళిలోని లాకాలేజ్ సమీపంలో గొంతు నులిమి చంపేసి శవాన్ని రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయారు.

 పిన్ని మీద పగతో కన్నతండ్రిని లేపేశారు

పిన్ని మీద పగతో కన్నతండ్రిని లేపేశారు

ఇస్లాయిల్ సాబ్ రెండో భార్య కతునబీ కేసు పెట్టడంతో అతని కొడుకు కూతురితో పాటు హత్యకు సహకరించిన ఐదు మందిని అరెస్టు చేశామని హుబ్బళి పోలీసులు తెలిపారు. పిన్ని సక్రమంగా చూసుకోవడం లేదని కానీస్టేబుల్ ఇస్మాయిల్ ను అతని కన్న బిడ్డలు హత్య చెయ్యడం హుబ్బళితో పాటు కర్ణాటకలో కలకలం రేపింది.

English summary
Family: Children killed father in Hubballi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X