సీఎం మీద మాజీ సీఎం ఏం చెప్పారు అంటే? మ్యారట్ లో క్లారిటీ ఉందా?, లేదా?
బెంగళూరు: హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్ ఆరోపించారు. ఎన్నికల ముందు చెప్పిన దానికి ఇప్పుడు అమలు చేస్తున్న దానికి చాలా తేడా ఉందని మాజీ సీఎం బసవరాజ్ మొమ్మెయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రకటించిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఇప్పుడు 12 నెలల సగటు వినియోగం ఆధారంగా ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. వారి రహస్య ఎజెండాలు బయటపడ్డాయని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులోకి రావని, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు అదే చేసిందని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోంది. మిగిలిన 5 కిలోలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్దం అవుతోందరి బసవరాజ్ బొమ్మయ్ ఆరోపించారు.
మొక్కజొన్న, మినుములు 10 కేజీల్లో ఉన్నాయా, లేదా ?, అదనంగా ఇస్తున్నారా అనే విషయాలపై కాంగ్రెస్ ప్రభుతవం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అన్నభాగ్య యోజన పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని.. 10కిలోల బియ్యంలో మినుము, మొక్కజొన్న ఉందో లేదో అర్థం కావడం లేదని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్ ఆరోపించారు.
గృహలక్ష్మి యోజన అమలులోనూ భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని బసవరాజ్ బొమ్మెయ్ ఆరోపించారు. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో సగం మంది లబ్ధిదారులు పథకం నుండి వైదొలిగారు. గ్రామపంచాయతీ, పీడీఓల సహకారంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయగలిగామని బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.
ఆగస్టు నుంచి ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పారు. జూన్, జులై నెలలకు సంబంధించిన డబ్బును జోడిస్తారా లేదా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. లేని పక్షంలో జూన్, జులైల సొమ్ము ఏమవుతుంది? దీన్ని పొందేందుకు ఇంకా ఎలాంటి షరతులు పెడతారో నాకు తెలియదు మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.












Click it and Unblock the Notifications