బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab: హిజాబ్ కోసం కాలేజ్ అమ్మాయిల డిమాండ్, ధర్నాలు, దెబ్బకు అందరూ సస్పెండ్, ఎంత చెప్పినా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మంగళూరు/పుత్తూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. విద్యాసంస్థల్లో హిజాబ్ లు, కాషాయ కండువాలు ధరించకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే .అయితే హిజాబ్ లు వేసుకున్న కొందరు అమ్మాయిలు కాలేజ్ కు వెళ్లారు. మేము హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వస్తామని, క్లాసుల్లో కుర్చుంటామని, లెక్చరర్లు కచ్చితంగా మాకు పాఠాలు చెప్పాలని కొందరు అమ్మాయిలు డిమాండ్ చేశారు.

హిజాబ్ లు వేసుకుని కాలేజ్ వెళ్లిన అమ్మాయిలను ప్రిన్సిపాల్ ఇంటికి పంపించేశారు. హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు మేము వస్తామని, తరగతులకు హాజరుకావడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసి ధర్నాలు చేసిన 23 మంది కాలేజ్ అమ్మాయిల మీద విద్యాశాఖ అధికారులు, కాలేజ్ అభివృద్ది కమిటీ సభ్యులు కలిసి సస్పెండ్ వేటు వేశారు.

Terrorist: బెంగళూరులో కాశ్మీర్ ఉగ్రవాది అరెస్టు, మసీదులో మకాం, పిల్లలకు పాఠాలు, భార్యతో ఎస్కేప్ అయ్యి!Terrorist: బెంగళూరులో కాశ్మీర్ ఉగ్రవాది అరెస్టు, మసీదులో మకాం, పిల్లలకు పాఠాలు, భార్యతో ఎస్కేప్ అయ్యి!

కర్ణాటక హైకోర్టు ఆదేశాలు

కర్ణాటక హైకోర్టు ఆదేశాలు

కర్ణాటకలో హిజాబ్ లు వేసుకుని స్కూల్స్, కాలేజ్ లకు వెళ్లడం కొన్ని నెలల క్రితం పెద్ద వివాదానికి దారితీసింది. హిజాబ్ లు, కాషాయం కండువాలు దరించకూడదని, మతపరమైన దుస్తులు దరించి విద్యాసంస్థల్లో అడుగుపెట్టకూడదని ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా కొందరు ముస్లీం అమ్మాయిలు న్యాయస్థానం ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

పరీక్షల సమయంలో ఏం జరిగిదంటే?

పరీక్షల సమయంలో ఏం జరిగిదంటే?

కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని, హిజాబ్ లు వేసుకుని పరీక్షలు రాయడానికి పరీక్షలు రాయడానికి రాకూడదని, అందుకు మేము అవకాశం ఇవ్వమని 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాసేసమయంలో విద్యాశాఖ అధికారులు మనవి చేశారు. అయినా కొందరు విద్యార్థులు హిజాబ్ లు వేసుకుని కాలేజ్ దగ్గరకు వెళ్లిన అమ్మాయిలకు అధికారులు పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వకుండా వెనక్కి పంపించారు. ప్రతిఒక్కరూ హైకోర్టు ఆదేశాలను పాటించాలని, శాంతిని కాపాడాలని విద్యాశాఖ అధికారులు ముస్లీం అమ్మయిలకు మనవి చేశారు.

కాలేజ్ లు ప్రారంభం

కాలేజ్ లు ప్రారంభం

ఇటీవల కర్ణాటకలో విద్యాసంస్థలు ప్రారంభం అయ్యాయి. స్కూల్స్, కాలేజ్ లకు హిజాబ్ లు వేసుకుని రాకూడదని విద్యాశాఖ అధికారులు మరోసారి మనవి చేశారు. అయితే మంగళూరు సమీపంలోని ఉప్పినంగడి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో కొంతమంది అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని వెళ్లి తరగతుల్లో కుర్చోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రిన్సిపాల్ కు చెప్పారు.

వెనక్కి పంపించిన ప్రిన్సిపాల్

వెనక్కి పంపించిన ప్రిన్సిపాల్

హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు రాకూడదని, మేము హైకోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ యాజమాన్యం విద్యార్థులకు చెప్పారు. మేము హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వస్తామని, క్లాసుల్లో కుర్చుంటామని, లెక్చరర్లు కచ్చితంగా మాకు పాఠాలు చెప్పాలని కొందరు అమ్మాయిలు కాలేజ్ ప్రిన్సిపాల్ ను డిమాండ్ చేశారు.

23 మంది కాలేజ్ అమ్మాయిలు సస్పెండ్

23 మంది కాలేజ్ అమ్మాయిలు సస్పెండ్

హిజాబ్ లు వేసుకుని కాలేజ్ వెళ్లిన అమ్మాయిలను ప్రిన్సిపాల్ ఇంటికి పంపించేశారు. హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు మేము వస్తామని, తరగతులకు హాజరుకావడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసి ధర్నాలు చేసి హంగామా చేసిన 23 మంది కాలేజ్ అమ్మాయిల మీద విద్యాశాఖ అధికారులు, కాలేజ్ అభివృద్ది కమిటీ సభ్యులు కలిసి సస్పెండ్ వేటు వేశారు. మొత్తం మీద కర్ణాటక హైకోర్టు ఆదేశాలను లెక్క చెయ్యకుండా ఏదో చెయ్యాలని అనుకున్న కాలేజ్ అమ్మాయిల పరిస్థితి ఇప్పుడు అదోగతి అయ్యిందని కొందరు న్యాయనిపుణులు అంటున్నారు.

English summary
Students: The Uppinangady Government First Grade College management has suspended 23 girl students, who staged a protest demanding permission to wear Hijab inside classrooms last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X