బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab Row: బుర్కాతో సమస్య కాదు, రోజు ఐదుసార్లు నమాజ్ అంటున్నారు, మంత్రి, అందుకే ఇలా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ శివమొగ్గ/ ఉడిపి/ హైదరాబాద్: హిజాబ్ వివాదం దెబ్బతో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు. హిజాబ్ (బుర్కాలు) వేసుకుంటామని మాత్రమే కొందరు విద్యార్థులు చెప్పడం లేదని, వాళ్ల కోరికలు మరో రకంగా ఉన్నాయని విద్యాశాఖా మంత్రి అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజ్ ల్లోని విద్యార్థులు అందరిని సమానంగా చూడాలని మా ప్రభుత్వం బావిస్తోందని, అందుకే అమ్మాయిలు, అబ్బాయిలకు యూనీఫామ్ వేసుకోవాలని నియమాలు పెట్టామని విద్యాశాఖా మంత్రి అంటున్నారు.

ప్రభుత్వ ఆదేశాలను అద్యాపకులు, ఉపాధ్యాయులు పాటిస్తున్నారని, ప్రభుత్వం చెప్పినట్లు వారు వ్యవహరిస్తున్నారని విద్యాశాఖా మంత్రి క్లారిటీ ఇచ్చారు. స్కూల్స్, కాలేజ్ ల్లోకి హిజాబ్ వేసుకుని వస్తామని చెబుతున్న కొందరు విద్యార్థులు క్లాసుల్లోకి వచ్చిన తరువాత మరో రకమైన కోరికలు కోరుతున్నారని, ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని కర్ణాటక విద్యాశాఖా మంత్రి బిసి, నాగేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hijab Row: బుర్కాల వివాదం, సెలవులు, క్లారిటీ ఇచ్చిన మంత్రి, అందరూ శాంతిని కాపాడండి!Hijab Row: బుర్కాల వివాదం, సెలవులు, క్లారిటీ ఇచ్చిన మంత్రి, అందరూ శాంతిని కాపాడండి!

చిన్న విషయాన్ని ఎంత చేశారో చూడండి

చిన్న విషయాన్ని ఎంత చేశారో చూడండి

కాషాయ కండువాలు వేసుకుంటామని, హిజాబ్ ( బుర్కాలు) ధరిస్తామని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని, ఇలాంటి విద్యార్థు డిమాండ్లు తీర్చడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దంగా లేదని ఆ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బిసి. నాగేష్ స్పష్టం చేశారు. హిజాబ్, కాషాయ కండువాల విషయంలో కర్ణాటక విద్యాశాఖా మంత్రి బిసి నాగేష్ మీడియాతో మాట్లాడారు.

రాజకీయ స్వార్థం కోసం?

రాజకీయ స్వార్థం కోసం?

ఉడిపిలో మొదలైన హిజాబ్ వివాదం కర్ణాటక మొత్తం వ్యాపించడానికి కొందరు రాజకీయ నాయకులు కారణం అంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బిసి. నాగేష్ ఆరోపించారు. కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం హిజాబ్ వివాదాన్ని రాజకీయం చేసి విద్యార్థుల చేతుల్లో నుంచి ఆ వివాదాన్ని వారి చేతుల్లోకి తీసుకుని రాజకీయంగా లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారని విద్యాశాఖా మంత్రి బిసి. నాగేష్ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించారు.

విధిలేని పరిస్థితుల్లో సెలవులు ప్రకటించాము

విధిలేని పరిస్థితుల్లో సెలవులు ప్రకటించాము

హిజాబ్ లు ధరిస్తామని, కాషాయ కండువాలు వేసుకుంటామని కొందరు విద్యార్థులు మొండి పట్టుదలకు పోయారని, ఇదే విషయాన్ని కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఉపయోగించుకుని చిన్న విషయాన్ని పెద్దది చేశారని, ఈ వివాదం ఉడిపి, శివమొగ్గ జిల్ాల నుంచి బాగల్ కోటే, బీజాపురతో పాటు పలు జిల్లాలకు వ్యాపించిందని, అందుకే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని కర్ణాటక విద్యాశాఖా మంత్రి బిసి నాగేష్ చెప్పారు.

పాకిస్తాన్, తాలిబన్ అనే మాటలు ఎందుకు?

పాకిస్తాన్, తాలిబన్ అనే మాటలు ఎందుకు?

కొందరు కావాలనే హిజాబ్ వివాదాన్ని పెద్దది చేశారని. దీని వెనుక క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఉందని అనుమానం ఉందని, దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని విద్యాశాఖా మంత్రి బిసి. నాగేష్ అనుమానం వ్యక్తం చేశారు. హిజాబ్ వివాదం విషయంలో కొందరు కావాలనే పాకిస్తాన్, తాలిబన్ అనే పదాలు ఉపయోగించి ఇంకా పెద్దది చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని, అది చాలా తప్పు అని మంత్రి బిసి, నాగేష్ విచారం వ్యక్తం చేశారు.

కరోనా దెబ్బ చాలాదా ?, ఇప్పుడు ఇంకో దెబ్బ ఎందుకు

కరోనా దెబ్బ చాలాదా ?, ఇప్పుడు ఇంకో దెబ్బ ఎందుకు

విద్యార్థులు కాని, రాజకీయ నాయకులు కాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించడం తప్పు అని మంత్రి బిసి నాగేష్ గుర్తు చేశారు. ఇప్పటికే విద్యార్థులు కరోనా వైరస్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు మరోసారి ఇలాంటి సంఘటనల వలన ఇబ్బందులు ఎదుర్కోకూడదని మంత్రి నాగేష్ విద్యార్థులకు సూచించారు.

సీఎం, హోమ్ మంత్రిని కలుస్తా..... విచారణ జరిపిస్తాం

సీఎం, హోమ్ మంత్రిని కలుస్తా..... విచారణ జరిపిస్తాం

హిజాబ్, కాషాయం కండువాల వివాదం ముదురిపోవడానికి కారణం అయిన వారిని గుర్తించడానికి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, హోమ్ మంత్రిని కలిసి మనవి చేస్తామని, తప్పు చేసిన వారిని గుర్తించి అలాంటి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఇక ముందు ఇలాంటి సంఘటనలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కర్ణాటక విద్యాశాఖా మంత్రి బిసి. నాగేష్ అన్నారు.

రోజూ ఐదు సార్లు నమాజ్ చెయ్యాలని అడుగుతున్నారు

రోజూ ఐదు సార్లు నమాజ్ చెయ్యాలని అడుగుతున్నారు

స్కూల్స్, కాలేజ్ ల్లోకి హిజాబ్ వేసుకుని వస్తామని చెబుతున్న కొందరు విద్యార్థులు క్లాసుల్లోకి వచ్చిన తరువాత మరో రకమైన కోరికలు కోరుతున్నారని, ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని కర్ణాటక విద్యాశాఖా మంత్రి బిసి, నాగేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

English summary
Hijab Row: Karnataka education minister BC Nagesh says some students demanding for five times namaz in school and college.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X