Hijab verdict: హైకోర్టు తీర్పు, సుప్రీం కోర్టులో సవాలు చేస్తాము, పిటిషన్లు వేసిన ముస్లీం అమ్మాయిలు!

బెంగళూరు: హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థలో అడుగు పెట్టకూడదని ఉడిపిలో కాలేజ్ ప్రిన్సిపాల్ తీసుకున్న నిర్ణయంపై కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఉదయం హిజాబ్ లు దరించే విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థల్లో వస్తామని ముస్లీం అమ్మాయిలు చెప్పడం సరికదాని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హిజాబ్ లు వేసుకోవాలని పట్టుపట్టకూడదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ప్రతివిద్యార్థి కచ్చితంగా పాటించాలని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ముస్లీం అమ్మాయిలు మంగళవారం మీడియాకు చెప్పారు.

కర్ణాటక హైకోర్టు తీర్పు

కర్ణాటక హైకోర్టు తీర్పు

హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థల్లో వస్తామని ముస్లీం అమ్మాయిలు చెప్పడం సరికదాని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హిజాబ్ లు వేసుకోవాలని పట్టుపట్టకూడదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

హైకోర్టు త్రిసభ్య బెంచ్ న్యాయమూర్తులు

హైకోర్టు త్రిసభ్య బెంచ్ న్యాయమూర్తులు

హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్తి, జస్టిస్ కృఫ్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ ఖాజీ జైబున్నీసా మోహిద్దీన్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ హిజాబ్ వివాదంపై దాఖలు అయిన అన్ని పిటిషన్లను విచారణ చేసి అందరి వాదనలను విన్నారు. అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం సంచలన తీర్పు చెప్పింది.

సుప్రీం కోర్టుకు వెలుతాము

సుప్రీం కోర్టుకు వెలుతాము

హిజాబ్ వేసుకుని కాలేజ్ కు వెలుతామని, హిజాబ్ లేకుండా మేము విద్యాసంస్థల్లో అడుగుపెట్టలేమని గతంలో ముస్లీం అమ్మాయిలు తేల్చి చెప్పారు. హిజాబ్ లు వేసుకుని కాలేజ్ లో అడుగుపెట్టడానికి అవకాశం లేదని కాలేజ్ ప్రిన్సిపాల్ తేల్చి చెప్పారు. ఉడిపికి చెందిన కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ ముస్లీం అమ్మాయిలు ఇప్పుడు తాము సుప్రీం కోర్టుకు వెలుతామని ఆ ముస్లీం అమ్మాయిలు అంటున్నారు.

తీర్పును గౌరవిస్తాము..... పోరాటం మాత్రం చేస్తాము

తీర్పును గౌరవిస్తాము..... పోరాటం మాత్రం చేస్తాము

హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు తరువాత హైకోర్టును ఆశ్రయించిన ముస్లీం అమ్మాయిలు కొందరు మీడియాతో మాట్లాడారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నామని ముస్లీం అమ్మాయిలు అన్నారు. అయితే మా పోరాటానికి ఫలితం చిక్కలేదని, మాకు న్యాయం కావాలని సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ మేము కాలేజ్ కు వెలుతామని కొందరు ముస్లీం అమ్మాయిలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+